calender_icon.png 6 December, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రక్తదానం ఒక మహత్తర సేవ: ఎస్పీ జానకి

06-12-2025 12:19:56 AM

మహబూబ్ నగర్ టౌన్, డిసెంబర్ 5: రక్తదానం ఒక మహత్తర సేవగా ప్రతి వ్యక్తి గ్రహించాలని జిల్లా ఎస్పీ డి. జానకి అన్నారు. శుక్రవారం హెచ్డీఎఫ్సీ మెయిన్ బ్రాంచ్ నిర్వహించిన రక్తదాన శిబిరానికి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో అనేక ప్రాణాలను రక్షించేది రక్తదానమే కావడంతో ఇలాంటి మంచి కార్యక్రమాలకు అందరూ ముందుకు రావాలని సూచించారు.

సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న  బ్యాంక్ సిబ్బంది ని ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజ్ క్లస్టర్ హెడ్ ప్రవీణ్ కుమార్ ఝా, ఫణి, శ్రీనివాస్, బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, సీనియర్ మేనేజర్లు రజాక్, రజినీకాంత్ రెడ్డి, డా. కీర్తి రెడ్డి, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.