calender_icon.png 6 December, 2025 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల వ్యయ నియమాలపై అభ్యర్థులకు అవగాహన

06-12-2025 12:18:28 AM

కల్వకుర్తి, డిసెంబర్ 5: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, వ్యయ పరిమితులపై శుక్రవారం కల్వకుర్తిలో ఎంపీడీవో  వెంకటరాములు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుండి గెలుపొందే వరకు అభ్యర్థులు చేసే ప్రతి ఖర్చును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని, ప్రతి వ్యయానికి అనుగుణంగా రసీదులు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.

అభ్యర్థుల వ్యయ పరిమితి వార్డు సభ్యుల అభ్యర్థులు గరిష్టంగా రూ, 30వేలు, సర్పంచ్ అభ్యర్థులు గరిష్టంగా రూ, 1.5లక్షలు మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిమితిని మించినట్లయితే అనర్హతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో  ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, వీడియో సర్వీలెన్స్ టీమ్, మోడల్ కోడ్ ఆఫ్ కన్డక్ట్ టీమ్ లు నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయని, అందువల్ల అభ్యర్థులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించి, నిబంధనలకు లోబడేలా వ్యయాలు నిర్వహించాలని ఆదేశించారు.