calender_icon.png 26 July, 2025 | 3:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీని రేవంత్‌రెడ్డి అవమానించారు

26-07-2025 12:32:09 AM

  1. కన్వర్టెడ్ బీసీ పేరిట సీఎం కొత్త కులాన్ని తెచ్చారు
  2. రాహుల్‌ది ఏ కులం.. ఆయన బ్రాహ్మిణా? గాయత్రీ మంత్రం వచ్చా
  3. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి లాగే మహేశ్‌గౌడ్‌కు సీఎం పదవి ఇవ్వాలి
  4. బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రామచందర్ రావు చిట్‌చాట్

హైదరాబాద్, జూలై 25 (విజయక్రాంతి): ప్రధాని మోదీని బీసీ కాదంటూ మొత్తం బీసీ సమాజాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు విమర్శించారు. రాహుల్ గాంధీది ఏ కులమని తాము ప్రశ్నిస్తే కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి కొత్త కులాన్ని తెరమీదకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. అసలు రా హుల్ బ్రాహ్మణుడైతే కనీసం గాయత్రీ మ ంత్రం వచ్చా అని ప్రశించారు.

అలాంటప్పు డు రాహుల్ ఎన్నటికీ బ్రాహ్మణుడు కాలేడని తెలిపారు. రేవంత్‌రెడ్డి గొప్ప నటుడని.. ఆ యనకు ఆస్కార్ అవార్డు కాకపోయినా అత్తారింటికి దారేదీ సినిమాలో బ్రహ్మానందానికి ఇచ్చినట్టుగా భాస్కర్ అవార్డుతో పాటు గ్లోబెల్స్ అవార్డు ఇవ్వాలని సోనియా గా ంధీకి సిఫార్సు చేస్తామని ఎద్దేవా చేశారు. శు క్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ యన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించా రు.

ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై రాంచందర్‌రావు మాట్లాడారు. దత్తాత్రేయ మీద రేవంత్‌రెడ్డికి ప్రేమ ఉండ టం సంతోషమని.. తనకు కూడా మంత్రి పొన్నం ప్ర భాకర్, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ మీద ఎంతో ప్రేమ ఉందని.. రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పొ న్నం ప్రభాకర్ లేదా మహేశ్ కుమార్ గౌడ్‌కు అవకాశం ఇ వ్వాలని కోరుకుంటున్నట్టు సీ ఎం వ్యాఖ్యల పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అలాగే రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ మీద ప్రేమ చాలా ఎ క్కువని.. గతంలో ఆ పార్టీ రాష్ర్ట కా ర్యదర్శి గా కూడా పని చేశారని గుర్తుచేశారు. అందుకే ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యా పిం గ్, కాళేశ్వరం అక్రమాలు పక్కకు పోయినట్టు కనిపిస్తోందన్నారు. బీజేపీకి మీడియా లో స్పేస్ లేకుండా చూసేందుకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆ రోపించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను తాను భయపెట్టడానికి నోటీసులు ఇవ్వలేదని.. ఆయన నోటీస్ పూర్తిగా చదవనట్టు ఉన్నారని తెలిపారు. కచ్చితంగా తాను ఈ అ ంశాన్ని కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చే శారు. కిషన్‌రెడ్డి పార్లమెంట్ పరిధిలోని ని యోజకవర్గమైన జూబ్లీహిల్స్ ఉపఎ న్నికను బీజేపీ సీరియస్‌గా తీసుకుంటున్నది తెలిపా రు. 

రాజాసింగ్ అంశం నా పరిధిలో లేదు..

రాబోయే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేం దుకు కష్టపడతానని, అదే తన ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం రాంచందర్‌రావు చే శారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అ ంశం తన పరిధిలోని లేదని తెలిపారు. ప్రతి గొడవకు సుఖాంతం ఉంటుందని అన్నారు. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్నది ఏడుగు రు ఎమ్మెల్యేలు మాత్రమేనని పేర్కొన్నారు.

బండి సంజయ్, ఈటల వివాదం త్వరలో స మసిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చే శారు. నల్లగొండ ఒకప్పుడు కమ్యూనిస్టు కో ట అని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని.. అక్కడ బీజేపీని బలోపేతం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం కూడా ఏదో ఒక్కరోజు కూలే పరిస్థితి వస్తుందన్నారు.

బీజేపీ రాష్ర్ట కమిటీలో 20 పోస్టులే ఉన్నాయని.. 8 వైస్ ప్రెసిడెంట్, 3 జనరల్ సెక్రటరీ, 7 సెక్రటరీ, ఒకటి కోశాధికారి పోస్టులకు గాను 5 పోస్టులు మహిళలకు, మూడు ఎస్సీ ఎస్టీల కు దక్కుతాయన్నారు. వారం రోజుల్లో రాష్ర్ట కమిటీ కసరత్తు పూర్తి అవుతుందన్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నట్టు తెలిపారు. 

అసెంబ్లీ సమావేశాలు లేకుండా ఆర్డినెన్స్ ఎలా..

బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసిందే బీజేపీ ప్రభుత్వమని రాంచందర్ రావు స్పష్టం చే శారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయకుండా బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ ఎలా తె స్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న కులగణన నివేదిక ను ఎందుకు బహిర్గత చేయడం లేదని, మి గతా కులాల లెక్కలు ఎందుకు ప్రజలకు తెలియచేయడం లేదని నిలదీశారు. బీసీలకు స ముచిత ప్రాధాన్యం కల్పిస్తామన్నారు.