26-07-2025 12:30:52 AM
ప్రధాన రహదారిపై రాస్తారోకో
మణుగూరు,జులై 25 ( విజయ క్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహి ళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామని, తమను ఆదుకోవాలని ఆటోడ్రైవర్లు ఆందోళన బాటపట్టారు.
ఉచిత బస్సులను సడలించాలని, ఆటో డ్రైవర్లకు జీవన భృతి రూ.12 వేలు చెల్లించాలని, ప్రతి ఆటోడ్రైవర్ కు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం, ఇందిరమ్మ ఇల్లు కేటా యించాలని డిమాండ్‌చేస్తూ నియోజకవర్గ ఆటో మ్యాజిక్, ప్రైవేట్ టాక్సీల వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లు, యజమానులు శుక్రవారం పట్టణంలో సురక్ష బస్టాండ్ నుండి, అంబేద్కర్ సెంటర్ వరకు భారీ నిరసన ర్యాలీ తో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రధాన రహదారిపై సుమారు గంట పాటు బైఠాయించి, రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డు ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సంద ర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం కల్పించి తమ బతుకులను ఆగంచేసిం దని మండిపడ్డారు. ఉపాధిని కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడ్డా మని, ఉచిత బస్సు సౌకర్యానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆటో డ్రైవర్లను సైతం ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నుండి పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.