రేవంత్‌రెడ్డిది గోబెల్స్ ప్రచారమే
సైనిక్ స్కూల్‌ను కేసీఆర్ పట్టించుకోలేదన్నది అబద్ధమే: వినోద్‌కుమార్
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం రేవం త్ కలిసిన తరువాత గోబెల్స్ ప్రచారం మొదలుపెట్టారని మాజీ ఎంపీ వినోద్‌కు మార్ విమర్శించారు. మంగళవారం తెలం గాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. సైనిక్ స్కూల్‌ను కేసీఆర్ పట్టించుకోలేదని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని, సీఎం కార్యాలయంలో కేసీఆర్ రాసిన ఉత్తరాలు ఉంటాయని, వాటిని ఒకసారి చూడాలని సూచించారు. వరంగల్‌లో సైనిక్ స్కూల్ అప్పుడే మంజూరు చేశారని, అప్పటి రక్షణమంత్రి మనోహర్ పారికర్‌ను స్కూల్ గురించి అనేకసార్లు కలిసినట్లు గుర్తుచేశారు.
నిరుద్యోగ సమస్యపై అసత్యాలు మాట్లాడు తూ యువతను రెచ్చగొడుతున్నారని, ఇకపై ఆయన వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తామ న్నారు. రక్షణశాఖ భూములపైనా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయని, రేవంత్‌రెడ్డికి సమయం ఉంటే అప్పటి రక్షణశాఖ అధికారి జేఆర్‌కే రావుతో మాట్లా డి నిజాలు తెలుసుకోవాలని హితవు పలికా రు. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో పోరాడింది బీఆర్‌ఎస్ మాత్రమేనన్నారు.






