calender_icon.png 7 December, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డివి వికృత చేష్టలు

07-12-2025 12:00:00 AM

  1. సీఎం సీట్‌లో కూర్చోబెట్టినా గుణం మార్చుకోరు
  2. కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై ఏడ్వడం తప్ప ఆయన చేసేదేముంది
  3. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి) : ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అవి అమలు చేయకపోగా, తన వికృత చేష్టలతో హోంగార్డులను తీవ్రంగా అవమానిస్తు న్నారని -మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రైజింగ్ డే సందర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ శనివారం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదని, అలాగే రేవంత్‌రెడ్డిని సీఎం సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం మా ర్చుకోరు.. మార్చుకోలేరని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

రెండేళ్లుగా కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ మీద పడి ఏడ్వడం తప్ప రేవంత్‌రెడ్డి చేసిందేముందని ప్రశ్నించారు. శనివారం ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... విజయోత్సవాలు అంటూ విచ్చలవిడిగా తిరుగుతూ, వికృతంగా మాట్లాడటం వల్ల చేయనివి చేసినట్లు అయిపోవని హితవు పలికారు. కేసీఆర్ అందించిన సంక్షేమ ఫలా లు ప్రజలు మరిచిపోరని సూచిం చారు.

నల్లగొండ ప్రజల మీద కక్ష కట్టింది ఎవరు? ఎస్‌ఎల్ బీసీ ప్రా జెక్టును నెవర్‌ఎం డింగ్ ప్రాజెక్టుగా డిజైన్ చేసిందెవరు? ప్రాజెక్టును పడావు పెట్టింది ఎవరు? అని నిలదీశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 11.48 కిలోమీటర్ల సొరంగం పూర్తి చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ లెక్కలు తమ ప్రభుత్వం దగ్గర లేవా?, పదేపదే అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నువ్వు మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ 

‘రెండేళ్లలో కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని నువ్వు ఇరిగేషన్ గురించి మాట్లాడితే ప్రజలకు ఇరిటేషన్ కలుగుతుంది’ అని విమర్శించారు. అక్రమంగా కృష్ణా నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే, అక్రమ ప్రాజెక్టులకు డీపీఆర్‌లు తయారు చేస్తుంటే అడ్డుకోలేని రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ మీద పడి ఏడుస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ అంటూ.. ఎవరిని మభ్య పెడుతున్నారని, ఇందులో ఎన్ని కోట్ల స్కాంకు ప్లాన్ వేశారు..

ఎవరి వా టా ఎంత అని ప్రశ్నించా రు. విస్తరి ఆకులా ఎగిరెగిరి పడుతున్న రేవంత్ రెడ్డి అహంకారం తగ్గించుకొని అజ్ఞానాంధకారం తొ లగించుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ దుర్మా ర్గ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని హరీష్‌రావు విమర్శించారు. రేవంత్‌రెడ్డి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని పేర్కొన్నారు. 

హోంగార్డులకు న్యాయం చేయాలి

ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో మీరు అందిస్తున్న సేవలు అమూల్యమని హోంగార్డులను మాజీమంత్రి హరీశ్‌రావు కొనియాడారు. హోంగార్డుల సేవలను గుర్తించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014లో రూ.9లుగా ఉన్న వేతనాన్ని, రూ. 27,600కు పెంచిందని, ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే వారికి 30 శాతం రిస్క్ అలవెన్స్ ఇవ్వడంతోపాటు మ హిళా హోంగార్డుల కు ప్రసూతి సెలవులిచ్చి ఆత్మగౌరవం పెంచిందన్నారు. కేసీఆర్ ప్రగతిభవన్ వేదికగా హోంగా ర్డులతో సమావేశమై వేతనాల పెంపుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం చూపారని తెలిపారు. సీఎం మాట  నిలుపుకోవాలన్నారు.