calender_icon.png 6 October, 2025 | 10:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలను నమ్మించి నట్టేట ముంచిన రేవంత్ సర్కార్

06-10-2025 12:00:00 AM

-మాజీ మంత్రి హరీష్ రావు 

- బీఆర్‌ఎస్లో చేరిన బీజేపీ నాయకులు

జహీరాబాద్, సెప్టెంబరు 5 :తెలంగాణ రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేసిన రే వంత్ సర్కార్ మళ్లీ ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని సిద్దిపేట ఎమ్మెల్యే, మా జీ మంత్రి హరీష్ రావు అన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసిఆర్ తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు. ఆదివారం న్యాల్కల్ మండలానికి చెందిన పలువురు బిజెపి నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు.

జ హీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు సమక్షంలో హైదరాబాద్ లోని హరీష్ రావు సమక్షంలో పార్టీ కండువాలను వేసుకున్నా రు. మాజీ ఎంపీపీ పాండురంగారావు పాటిల్, నాయకులు బసవరాజ్ పాటిల్, మ ల్లప్ప, వీర్ శెట్టి, రాజు, మారెప్పతోపాటు దా దాపు 35 మంది న్యాల్కల్ మండలానికి చెం దిన ముఖ్య నాయకులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా హరీష్ రావు మా ట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ కైవసం చేసుకోవడమే కాకుండా అన్ని జెడ్పిటిసి స్థానాలు కూడా కైవసం చేసుకుంటుం దని జోష్యం చెప్పారు.

ఉమ్మడి మెదక్ జిల్లా లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తె లిపారు. తెలంగాణ ప్రజలను దోచుకోవడం లో కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు దొందుదొందేనని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చిం దని విమర్శించారు. దేశవ్యాప్తంగా 157 మె డికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా ఇవ్వలేద న్నారు.

రైతులకు యూరియా సరఫరా చే యడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని, రైతులను అష్టకష్టాలకు గురి చేస్తు న్నారని ఆయన వాపోయారు. ఆరుగలం కష్టపడి రైతులు పండించే పంటకు సరైన గి ట్టుబాటు ధర ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని తెలిపారు. కార్యకర్తలందరూ కష్టపడి బిఆర్‌ఎస్ పార్టీని గెలిపించి కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపుని చ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు విజేందర్ రెడ్డి, అప్పారావు పాటిల్, దేవదాస్ తదితరులుపాల్గొన్నారు.