06-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే కోవ లక్ష్మి డిమాండ్
కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 5 (విజయక్రాంతి): పోలీసులు వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఈ నెల 3న జిల్లా కేంద్రంలో దుర్గా, శారదామాత నిమజ్జనం సందర్భంగా సాంప్రదాయబద్ధంగా శాంతియుతంగా ఊరేగింపు నిర్వహిస్తున్న.
బ్రాహ్మణవాడ మహిళలపై ఎస్సై అనుచిత వాఖ్యలు చేయడంతో పాటు పలువురు నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని కేశ వనాధ మిని పంక్షన్ హాల్లో హిందూ సం ఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాదరావుతో పాటు శారదా, దుర్గా మాత మండళ్ల నిర్వహకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూ ఉత్సవాల పై పోలీసుల పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. ఉత్సవ సమితి చెప్పినట్లు నడుచుకోవాలన్నారు. పోలీసులు మాట్లాడే విధానం సరికాదన్నారు. డిజెలతో ఉపాది పొందుతున్న యువతకు చెందిన డిజెలను పోలీస్ స్టేషన్‌కు సరికాదన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.
డిసిసి అధ్యక్షుడు విశ్వ ప్రసాదరావు మాట్లాడుతూ కొత్తగా వచ్చిన సీఐ చిన్న చిన్న విషయాలపై ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. శుక్రవారం రాత్రి ఎఎస్పీ చిత్తరంజన్ ఎస్సెపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, తల్లవారున నిర్వాహకులపై కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అరిగెల మల్లికార్జున్ యాదవ్ మాట్లాడుతూ పోలీసులు హిందూ దేవీ దేవతలను అవమాన పరచ డం సరికాదన్నారు. కార్యక్రమానికి హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు సంతోశ్, మాజీ ఎఎంసీ చైర్మన్లు వెంకన్న, మల్లేశ్, మాజీ ఎంపీపీ బాలేశ్వర్ గౌడ్ పాల్గొన్నారు.