calender_icon.png 6 October, 2025 | 1:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమినిలో పడకేసిన పారిశుద్ధ్యం

06-10-2025 12:00:00 AM

పంచాయతీలో అడుగడుగున సమస్యలు... పట్టించుకోని పంచాయతీ అధికారులు 

భీమిని, అక్టోబర్ 5: పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. పంచాయతీల్లో అడుగడుగున సమస్యలతో గ్రామ స్తులు ఆందోళన చెందుతున్నారు. మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని కురుమ వాడ నుంచి ఎస్టీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారి మూలమలుపు వద్ద మంచినీటి వాటర్ ట్యాం కు అనుకొని చెత్తకుప్పలు నెలలుగా దర్శనమిస్తున్నాయి.

గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నప్పటికీ వారితో పని చేయించేవారు లేరు. పంచాయితీ కార్యదర్శి ఇటువైపు కన్నెత్తి చూసి న దాఖలాలు లేవని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండ్లల్లోకి వెళ్లాలంటే దారి వెంట దుర్వాసన వస్తున్నట్లు నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాత్రిపూట దోమ ల బెడద ఎక్కువగా ఉన్నట్లు స్థానిక ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త సేకరణ జరగడం లేదని కాలనీవాసులు అంటు న్నారు.

చెత్త వేసే చోట కొందరు కాలనీ వాసు లు బహిర్భూమికి సైతం వెళ్లడంతో దుర్వాసన వెదజల్లి ముక్కు మూసుకునే పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికైనా అధికారులు రహదారి పక్కన ఉన్న చెత్తను తొలగించి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.