14-01-2026 12:55:45 AM
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కంది శ్రీనివాస రెడ్డి పాదయాత్ర
ఆదిలాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): ము న్సిపల్ ఎన్నికల నేపథ్యం లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేవంతన్న బస్తీబాట కార్య క్రమాన్ని నిర్వహించారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో మున్సిపల్ పరిధిలోనీ వార్డులలో చేపట్టే పాదయాత్ర కు మంగళ వారం ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే 7, 8 వార్డులలోని కేఆర్కే కాలనీలో పెద్ద సంఖ్యలో హాజరైన కాంగ్రెస్ శ్రేణులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంపిణీ చేసారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాలనీ వాసులకు విజ్ఞప్తి చేసా రు. తను ఎల్లప్పుడు ఆదిలాబాద్ ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ బాదన్ గంగన్న, నాయకులు బాదన్ గంగన్న, గంగాధర్, బండారి సతీష్, సంద నర్సింగ్, కలాల శ్రీనివాస్, లోక ప్రవీణ్ రెడ్డి, జాఫర్, ఇమ్రాన్, రామ్ కుమార్, లక్ష్మణ్, శాంతన్ రావు, భూపెల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.