calender_icon.png 14 January, 2026 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

30 ఏండ్ల మురిపెం.. కండ్లముందే స్వప్నం

14-01-2026 12:54:37 AM

సహకారం కాబోతున్న సదర్‌మాట్ ప్రాజెక్ట్

16న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం

పెండింగ్‌లో భూనిర్వాసితుల డిమాండ్

నిర్మల్, జనవరి 13 (విజయక్రాంతి): 30 ఏండ్ల రైతుల పోరాటం ఫలించబోతుంది. గోదావరి నదిపై  రూ 520.29 కోట్లతో నిర్మించిన సదర్ సదర్ మట్ ప్రాజెక్ట్ ను ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  ప్రారంభించనున్నారు. గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన ప్రాజెక్టులో ఇది మూడోది. నిజామాబాద్ నిర్మల్ జిల్లా సరిహద్దులో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మించగా దాని కింద నిజాం కాలంలో నిర్మించిన సదర్ మార్ట్ ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడం గోదావరి ప్రభావానికి అడ్డుకట్ట నిర్మించి నీటిని ఆయకట్టు రైతులకు మళ్ళించే విధంగా అప్పట్లో దీన్ని నిర్మించారు.

గోదావరిఖనిపై సదర్ మార్ట్ ప్రాజెక్టును నిర్మించాలని 30 ఏండ్లుగా కడెం ఖానాపూర్ జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ ఇబ్రహీంపట్నం రైతులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో సదర్మాద్ ప్రాజెక్టు నిర్మిస్తామని పాలకులు రైతులకు హామీ ఇస్తూ వచ్చారు. నీళ్లు నిధులు నియామకాలు లక్షంగా ఏర్పడ్డ తొలి తెలంగా ణ ప్రభుత్వం సదర్మాద్ ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి పెట్టి 2016లో రూ.520. 39 కోట్ల నిధులు మంజూరు చేశా రు. ఈ పనులను అప్పటి భారీ నీటి పారుదల ఆర్థిక శాఖ నీటి పాదాల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు

రెండు జిల్లాలకు ప్రయోజనం

నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్నకల్ గ్రామ శివారులో గోదావరి నదిపై నిర్మల్ జగిత్యాల సరిహద్దులు నిర్మించారు. ఈ ప్రాజెక్టు శ్రీరాంసాగర్ దిగువన 40 కిలోమీటర్ల దూరంలో 1.58 టీఎంసీ కెపాసిటీలో ఒక కిలోమీటర్ పొడుగులో 55 వరద గేట్లతో ఈ ప్రాజెక్టు 2025 లో పూర్తి చేశారు. గోదావరి నది రెండు నది ఒడ్డులను కలుపుకొని నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్ల నిర్మల్ జగిత్యాల జిల్లా లోని ఖానాపూర్ కడెం ఇబ్రహీంపట్నం మల్లాపూర్ మండలంలోని 18వేల ఎకరాలకు సాగు నీరు అందించనుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం లో నిర్మల్ జిల్లాలోని ఆదర్శనగర్ కొమ్మల్కోట్ పోనకల్ గ్రామాల పరిధిలో 1230 ఎకరాలు రైతుల భూములు ముంపు గురయ్యాయి. ప్రభుత్వం నష్టపరిహారం కింద ఎక రానికి 14.30 లక్షల నష్టపరిహారాన్ని అందించింది. ఈ పరిహారాన్ని అప్పటి ప్రభుత్వం రైతు ఖాతాలో జమ చేసింది.  ప్రస్తుతం సదర్ మార్ట్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడంతో 10 కిలోమీటర్ల పొడుగులో గోదావరి నదిలో నీరు నిల్వ ఉంది.

ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే దిగువలో ఉన్న నిజాం కాలంలో నిర్మించిన సదర్‌మార్ట్ ఆనకట్టకు నీరు చేరి అవకా శం ఉంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు మొత్తం ఈ ప్రాజెక్టులోకి నేరుగా చేరుతుంది. ప్రాజెక్టు నిర్మించాలని 30 ఏండ్లుగా ఖానాపూర్ కడెం ఇబ్రహీంపట్నం మల్లాపూర్ తదితర గ్రామాల ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అనేకసార్లు ఉద్యమా లు కూడా చేపట్టారు. దీంతో ప్రాజెక్టు నిర్మా ణం పనులు పూర్తికావడంతో రైతులకు సాగునీటి కళ నెరవేరబోతుంది. మరో 14 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల నిర్మల్ జగిత్యాల నిజామాబాద్ జిల్లాలోని సుమారు 30 గ్రామాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. 

ఎత్తిపోతల పథకంపై రైతుల డిమాండ్

గోదావరి నదిపై నిర్మించిన సదర్ మట్ ప్రాజెక్టు ఈనెల 16న ముఖ్యమంత్రి ప్రారంభించనున్న  నేపథ్యంలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఆదర్శనగర్ కొమ్మలకోట పొన్నకల్ గ్రామాల్లో సుమారు 1230 ఎకరాలు వ్యవసాయ పంట భూములు కోల్పోయారు అయినప్పటికీ ఈ గ్రామాల రైతులకు ప్రాజెక్టు ద్వారా సాగునీరు అంది అవకాశాలు లేకుండా పోయింది. ఏడు దశాబ్దాల కింద గోదావరి నదిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణంలో భూములను కోల్పోయి పునరావాసం క్రింద ఈ ప్రాంతంలో తాము జీవనం సాగిస్తే రెండోసా రి భూములను ప్రాజెక్టు కోసం కోల్పోవలసి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పొల్కల్ బ్యారేజీ బ్యాక్ వాటర్‌లో ఎత్తిపోతల పథకాన్ని కొత్తగా మంజూరు చేసి ఈ మూడు గ్రామాల్లో రైతులకు ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు మళ్లించే విధంగా ప్రభు త్వం కొత్త ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్టులో నిలువ ఉన్న బ్యాక్ వాటర్ ఉపయోగించుకుని ఉన్న భూముల్లో సేద్యానికి నీరు మళ్లించినట్లయితే రెండు పంటలు పండించుకునే అవకా శం ఉంటుందని రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నారు.

అప్పట్లో మంత్రి హరీష్ రావు ఎత్తిపోతల పథకంపై రైతులకు హామీ ఇచ్చారని ఇప్పటికీ కార్యరూపం దాల్చకపోవడంపై వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆనవాళ్లు కోల్పోయిన నాగదేవత ఆలయ పునర్నిర్మా ణం సదర్మాద్ ప్రాజెక్టుకు నాగదేవత పేరు పెట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.  సదర్ మార్ట్ ప్రాజెక్టు కింద కాలువ తవ్వకాలు చేపట్టి పాత సదర్ మార్ట్ కడెం ప్రాజెక్టుకు నీళ్లు మళ్లించే విధంగా కాలువ నిర్మాణం చేపట్టాలని ఇప్పటికీ కడెంలో రైతులు పోరాట దీక్ష ప్రారంభించారు. కాలువలు నిర్మిస్తే ప్రాజెక్టు నుంచి విడుదలైన నీరు చివరి ఆయకట్టు వరకు చేరి రైతులకు మరింత ప్రయోజనం దక్కుతుందన్నారు ఈ విషయంపై ముఖ్యమంత్రికి విన్నవించేందుకు ఆ యొక్క రైతులు కార్యచరణ రూపొందిస్తున్నారు.

సీఎం దృష్టికి రైతుల డిమాండ్లు

గోదావరి నదిపై సదర్ మట్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఖానాపూర్ కడెం మండల రైతులు 30 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తున్నా రు. గత ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం కొరకు నిధులు మం జూరు చేయడంతో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేసి ఈనెల 16న ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభించబోతున్నాం. నిర్మల్ జగిత్యా ల జిల్లాలోని 18 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంటుంది. రైతులు డిమాండ్ చేస్తున్న కాలువ నిర్మాణం ఎత్తిపోతల పథకం విషయమై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా రైతులకు న్యాయం జరగటం చూస్తాం.

వెడ్మ బొజ్జు పటేల్, ఎమ్మెల్యే

ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలి

గోదావరి నదిపై నూతనంగా నిర్మించి న సదర్ మాట్ ప్రాజె క్టు నిర్మాణం కోసం ఆదర్శనగర్ కొమ్మలకోట పొనకల్ గ్రామా లకు చెందిన రైతులు 1200 ఎకరాలు ముంపుకు గురైంది. ఈ ప్రాంతంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో మొదటిసారి భూములు ఇచ్చిన రైతులు రెండవసారి సదరమా బ్యారేజీ నిర్మాణానికి భూములు ఇచ్చినందున లిఫ్ట్ ఇరిగేష న్ ఏర్పాటు చేస్తే ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ఉన్న భూముల్లో రెండు పంటలు పండించుకుని రైతులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం.

సుధాకర్‌రెడ్డి, రైతు పొనకల్