calender_icon.png 19 October, 2025 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలులో తెలంగాణ అధికారులతో సమీక్ష సమావేశం

17-10-2025 12:27:05 AM

హాట్ టాపిక్‌గా మారిన వైనం 

గద్వాల, అక్టోబర్ 16 ( విజయక్రాంతి ) / అలంపూర్ : జిల్లాకు చెందిన పంచాయతీరాజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని కర్నూలులోని చల్లా బంగ్లాలో నిర్వహించిన తీరు శుక్రవారం హాట్ టాపిక్ గా మారడంతో పాటు పలు విమర్శలకు తావిస్తోంది.కోట్లు ఖర్చు చేసి అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మిస్తే.. అధికారకంగా అక్కడ నిర్వహించాల్సుకోవలసిన సమీక్ష సమావేశాలను అనధికారకంగా అధికారులను చల్లా బంగ్లాకు పిలిపించుకుని ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే విజయుడు తీరు పై వాట్సాప్ వేదికగా పలువురు మండి పడుతున్నారు.

జోగుళాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమావేశానికి అధికారులు ఎలా హాజరవుతారని వారికి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని వెళ్లారా ఇలా అయితే భవిష్యత్తులో కర్ణాటక రాష్ట్రంలో.. మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా పంచాయతీరాజ్ సమావేశం పెడతారు అన్నటువంటి చర్చ వాట్సాప్ గ్రూప్ వేదికగా జరుగుతూ వైరల్‌అవుతున్నాయి.