calender_icon.png 19 October, 2025 | 11:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ గైర్హాజరుపై కలెక్టర్ ఆగ్రహం

17-10-2025 12:25:49 AM

తెలకపల్లి పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ బాదావత్ సంతోష్

నాగర్ కర్నూల్ , అక్టోబర్ 16 (విజయక్రాంతి)జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ గురువారం తెలకపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సంధ్య, ఇతర సిబ్బంది విధులకు గైర్హాజరుగా ఉన్నట్లు గుర్తించి షోకాస్ నోటీసు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, జిల్లా వైద్యాధికారులు ఏకంగా జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భాలలోనూ ఎప్పుడూ కూడా తెలకపల్లి వైద్యాధికారులు పీహెచ్సీలో అందుబాటులో లేకపోవడం గమనార్హం.

కలెక్టర్ ఫార్మసీ మందుల స్టాక్, రిజిస్టర్లు, రిపోర్టులు మొదలైన వాటిని పరిశీలించారు. ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా సేవలు అందించాలని సూచించారు. అనంతరం తెలకపల్లి మండలం, గౌరెడ్డిపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించబడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు. అసలైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

నూతన ఓటరు కార్డులు పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపిణీ జరుగుతుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యార్థులకు ఆయా పాఠశాల యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు కలెక్టర్‌తెలిపారు.