నర్మెట్టలో సీఎం పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన
12-03-2026 01:23 AM
నంగునూరు, మార్చి 11: సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట్టలో నూతనంగా నిర్మించిన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈ నెల 22న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో సిద్ధిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి, రూరల్ సీఐ శ్రీను, రాజగోపాల్పేట ఎస్‌ఐ వివేక్ మంగళవారం ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్ ఏర్పాటు, వాహనాల పార్కింగ్ స్థలాలను అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..కార్యక్రమానికి రైతులు, ప్రజలు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.




