నేరేడుచర్లలో బీజేపీ ఆధ్వర్యంలో ‘సర్’ ప్రక్రియపై సమీక్ష
నేరేడుచర్ల, జూలై 27: నేరేడుచర్ల మున్సిపాలిటీలోని వివిధ బూత్ ల బీఎల్వో లను భాజపా పట్టణ అధ్యక్షులు కొణ తం నాగిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణ కమిటీ కలిసి సర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఓటరు ధ్రువీకరణ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ , కొత్త ఓటర్ల నమోదు, తొలగింపుల ప్రక్రియపై వివరాలు తెలుసుకోవడంతో పాటు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా, ప్రతి అర్హులైన ఓటరికి అవకాశం కల్పించేలా పారదర్శకంగా విధులు నిర్వహించాలని బిఎల్.వో లకు సూచించడం జరిగింది.
అలాగే కొత్త పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు మరియు సౌకర్యాలు సరిగా లేక ఓటర్లకు దూరంగా ఉన్న దగ్గర పోలింగ్ స్టేషన్ల మార్పుల గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమoలో భాజపా జిల్లా కౌన్సిల్ మెంబర్ కుందూరు కోటిరెడ్డి,సర్ నియోజకవర్గ ఇన్చార్జి తాళ్ల నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి, ఉరిమల్ల రామ్మూర్తి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏమిరెడ్డి శంకర్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షులు జూలూరి అశోక్, బైరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొప్పు లక్ష్మీనారాయణ, దేవిరెడ్డి నాగిరెడ్డి, బుస్సా విమల, చేపూరి కృష్ణవేణి, బూత్ బి.ఎల్.ఒ లు పాల్గొన్నారు.






