calender_icon.png 12 July, 2025 | 11:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనాల ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్‌తో సమీక్ష

12-07-2025 01:58:43 AM

గాంధీనగర్  కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): డివిజన్ లో ఈ నెల 20వ తేదీన జరిగే తెలంగాణ బోనాల పం డుగ ఉత్సవాల కొరకు హెచ్‌ఎం జిహెచ్‌ఎంసి  ఆధ్వర్యంలో జరిగే  ఏర్పాట్లు, డివిజన్ లో పెండింగ్ అభివృద్ధి పనులపై శుక్రవారం జిహెచ్ ఎంసి కార్యాలయంలో  జోనల్ కమిషనర్ రవి కిరణ్ తో గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమా ర్, బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్‌తో కలిసి భేటీ అయ్యారు.

డివిజన్ లోని అమ్మవార్ల దేవాలయాల వద్ద పేరుకుపోయిన చెత్త చెదారం, మట్టి కుప్పలు తొలగించేందుకు ప్రత్యేకంగా వెహికల్స్ ఏర్పాటు చేయాల న్నారు.  బోనాలతో దేవాలయాలకు వచ్చే మహిళలకు, భక్తులకు అసౌకర్యం కలుగకుండా రోడ్లపై గుంతల ను పూడ్చేందుకు ప్యాచ్ వర్క్ పనులు జరిపించాలన్నారు.  ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది డివిజన్ లోని దేవాలయాలకు సరిపడే విధం గా 500 లైట్ల ఏర్పాటు చేయాలని కోరారు.

జిహెచ్‌ఎంసి ద్వారా ముంద స్తు పండుగ ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాలని కార్పొరేటర్ కోరారు. వాటితో పాటు డివిజన్ లో పెండింగ్ లో వున్న అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు సహకరించాలని జోనల్ కమిషనర్‌కు  సూచిం చారు. సానుకూలంగా స్పం దించిన జోనల్ కమిషనర్ బోనాల పండుగ ఏర్పాట్ల పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని, అలాగే డివిజన్ లోని పెండింగ్ అభివృద్ధి పనులపై ప్రత్యేక చర్యలు చేపడుతామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.