calender_icon.png 12 July, 2025 | 6:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీటీడీలో అన్యమతస్తులకు ఉద్యోగాలా?

12-07-2025 02:01:21 AM

  1. కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  2. కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనం

కరీంనగర్, జూలై 11 (విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందికిపైగా అన్యమతస్తులకు ఏ విధంగా ఉద్యోగాలిచ్చారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా ఆ అనవాయితీని ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే వాళ్ల ను ఉద్యోగాల నుంచి తొలగించాలని డి మాండ్ చేశారు.

కరీంనగర్‌లో భూమిపూజ చేసిన శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని వెంటనే నిర్మించాలని కోరారు. ఇల్లందకుంట రామాలయం, కొండగట్టు అంజన్న ఆలయాలకు నిధులు కేటాయించాలని కోరారు. తన పుట్టిన రోజు సందర్భంగా  శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

బండికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు

బండి సంజయ్‌కు ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీశ్ ధన్‌ఖడ్, హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలుపుతూ సందేశం పంపా రు. అమిత్ షా.. బండి సంజయ్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.