12-07-2025 01:57:40 AM
తెలంగాణ రాష్ట్రానికి సంజయ్ కుమార్ ఒక దిక్సూచిగా మారి.... రాష్ట్రంలో బీజేపి అధికారంలోకి వచ్చేలా కర్తవ్యం పోషించేలా భగవంతుడు శక్తిని ప్రసాదించాలి: మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు
కరీంనగర్, జులై11(విజయక్రాంతి): .సా మాన్య కార్యకర్త, కార్పోరేటర్ స్థాయి నుండి కేంద్ర మంత్రి గా బండి సంజయ్ కుమార్ ఎదగడం కరీంనగర్ జిల్లాకు చాలా గర్వకారణమని బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బం డి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘ నంగా జరిగాయి. శుక్రవారం రోజు భాజాపా శ్రేణులు నగరంలో కేకులు కట్ చేసి...
పలు సమాజిక కార్యక్రమాలు చేపట్టి... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన సంబరాలు చేశారు. ఇం దులో బాగంగా బీజేపి నాయకులు మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు భగత్ నగర్ క్యాంపు కార్యాలయం వద్ద బండి సం జయ్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనం గా నిర్వహించారు. డివిజన్ మహిళలు, ప్రజలతో కలిసి క్యాంపు కార్యాలయం వద్ద కేక్ క ట్ చేసి సంబరాలు చేశారు.
స్థానిక మహిళలు ప్రజలకు వివిధ రకాల పూలు, పండ్ల మొక్కలను పంపిణీ చేసి... కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కు పుట్టిన రోజు శు భాకాంక్షలు తెలిపారు. తదనంతరం కరీంనగర్ నగరంలో బీజేపి శ్రేణులు చేపట్టిన వివి ధ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం, అన్నధానం కా ర్యక్రమాలను ప్రారంభించారు. సుభాష్ నగ ర్ లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద నిర్వహించిన జన్మదిన వేడుకల్లొ ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు చేశారు.
తెలంగాణచౌక్‌లో భారతీయ జన తా పార్టీ ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో అ ధ్యక్షులు కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ ప్ర వీణ్ రావు,పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మే యర్ యాదగిరి సునీల్ రావు భారీ కేక్ కట్ చేసి... టపాసులు కాల్చుతూ సంబరాలు చే శారు. గిరిజన విభాగం ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో లంబాడి సోదరిమనులతో కలిసి జన్మదిన సంబరాలు చేశారు. మరో వైపు హౌజింగ్ బోర్డ్‌బోట్ జంక్షన్ వద్ద ఈస్టు జో న్‌లో కచ్చకాయల రాజు ఆద్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి అన్నదానం చేశా రు.
టవర్ సర్కిల్ ప్రాంతంలో మాజీ కా ర్పోరేటర్ వంగల శ్రీదేవి ఆద్వర్యంలో చేపట్టిన వేడుకల్లో కేక్‌కట్ చేసి... అన్నదానం చే శారు. సౌత్‌జోన్‌ఆద్వర్యంలో భగత్ సింగ్ విగ్రహాం వద్ద బీజేపి నాయకుల ఆద్వర్యం లో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా హా జరై కేక్ కట్ చేసి అన్నధానం చేశారు. ఈ సందర్భంగా బీ జేపి నాయకులు మాజీ మే యర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ.... కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వం భాజా పా శ్రేణులంతా సంఘటితంగా ఉండి రాబో యే రోజుల్లో కరీంనగర్ బల్దియా పై కాషా యం జెండా ఎగరవేయడానికి సిద్ధంగా ఉం డాలని పిలపు నిచ్చారు.
పెద్దలు బండి సంజ య్ కుమార్ ఒక సామా న్య కార్యకర్తగా కా ర్పోరేటర్ పదవి చేపట్టి... తాను ప్రాతినిధ్యం వహించిన డివిజన్‌లో ప్రజలకు ఎన్నో సేవ లు అందించారని తెలిపారు. అదే స్పూర్తితో కార్పోరేటర్ స్థాయి నుండి రెండు పర్యయా లు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా మో ది గారి ప్రభుత్వం లో కేంద్ర హోం శాఖ స హాయ మంత్రి హో దాలో దేశ ప్రజలకు తె లంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తుండటం కరీంనగర్ జిల్లాకు గర్వకారణం అన్నా రు. వారి నాయకత్వం భారతీయ జనతా పా ర్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి తెలంగా ణ రాష్ట్రం లో పార్టీ అధికారం లోకి వచ్చేలా అమ్మవారి దివేనలుఉండాలనికోరారు.