09-02-2026 04:56:20 PM
కాగజ్ నగర్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ నిర్వహణతో పాటు డిఏవి లక్ష్మీపత్ సింగానియా స్కూల్ (పాత బాల విధ్యా మందిర్ స్కూల్)లో ఏర్పాటు చేస్తున్న స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, పార్కింగ్ ఏర్పాట్లను సోమవారం జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరిత, సబ్ కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, మున్సిపల్ కమిషనర్ బి.తిరుపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏబి రమాదేవి, ఎమ్మార్వో మధుకర్, టౌన్ సీఐ ప్రేమ్‌కుమార్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
స్ట్రాంగ్ రూమ్ భద్రత, సీసీ కెమెరాల ఏర్పాటు, పోలీస్ బందోబస్తు, బ్యారికేడింగ్, విద్యుత్ సరఫరా, తాగునీరు, ఇతర మౌలిక వసతులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలి.