calender_icon.png 9 February, 2026 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు హిందువులపై దాడులు

09-02-2026 05:00:56 PM

- సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజస్థాన్ భవన్లో సోమవారం విలేకరుల సమావేశంలో ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు. ఈనెల 7వ తేదీ  కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద చికెన్ సెంటర్ లో పనిచేస్తున్న అజారుద్దీన్ అనే వ్యక్తి బైక్ మీద వెళుతున్న పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కేశెట్టి శంకరయ్యను బండతో కొట్టారని అన్నారు.

విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న భాజపా నాయకులు శివ గౌడ్,  చిలువేరు ప్రవీణ్ ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తే మజాక్ లో కొట్టానని హేళనగా మాట్లాడారని, కేసు పెట్టాలని దరఖాస్తు ఇస్తే హిందువుల మీద ఆరు సెక్షన్లతో నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారని తెలిపారు. అదే అజారుద్దీన్ మీద కేవలం ఒక సెక్షన్ కేసు పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ఆరోపించారు.

మైనార్టీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారని, ఎమ్మెల్సీ దండే విఠల్ కు దమ్ముంటే  భాజపా కన్న ఒక్క సీటు అదనంగా సాధించాలని, ఈ అక్రమ కేసులు బనాయించి కోనప్ప బాటలో నడవద్దని హితవు పలికారు. సాక్షాత్తు కాగజ్ నగర్ డీఎస్పీ వహీదుద్దీన్ మైనారిటీల సంతూస్టీకరణకు పాల్పడుతుతూ, కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలిపారు. అక్రమ కేసులకు తాము ఎన్నడూ భయపడలేదని తన మనోబలం రెట్టించిందని, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ బల్దియాపై కాషాయ జెండా ఎగరవేస్తామని, ప్రజలు ఇటువంటి విభజన రాజకీయాలను చీదరించు కుంటున్నారని , కర్రు కాల్చి వాత పెడతారని తెలిపారు.