11-11-2025 12:45:55 AM
-యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో విద్యార్థులకు మహర్దశ
-65 ఏరియాలో 25 ఎకరాల కేటాయింపు
-భూముల ధరలకు రెక్కలు..
బెల్లంపల్లి అర్బన్, వవంబర్ 10: బెల్లంపల్లిలోని ఆనాటి కాలనీలు అడుగంటాయి. ఒకప్పుడూ సింగరేణి గనులతో అభివృద్ధి వెలుగులతో విరాజిల్లాయి... నేడు గనులు మూతపడి, కార్మికులు వెళ్ళిపోయి వెలవెల బోతున్నాయి. పారిశ్రామిక ఉనికి కోల్పోయా యి... కాలగర్భంలో కలిసిన కాలనీ ప్రాంతా లు అనూహ్యంగా ఇంటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరుతో పునర్జీవం పోసుకున్నా యి. ఇంతకీ ఆ మహార్దశను ఆవరించుకున్న ఆ ప్రాంతం ఎక్కడా అని ఆసక్తి చూరగొన్న ఆ కార్మిక వాడల చరిత్ర మరోసారి తెరకెక్కింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని పురాతన బొగ్గు గని శాంతి ఖనితో వెలసిన కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం కార్మిక కాలనీలు ఏర్పడ్డాయి. శాంతిఖని, 85 డిప్, 65 డిప్, నెంబర్ 2 ఇంక్లైన్ బస్తీ, సుభాష్ నగర్, ఇంక్లైన్ రడగంబాలబస్తీ, ఏఎంసీ, గోల్ బంగ్లా ఏరియాలను పొందించారు. 1991లో సింగరేణిలో ప్రవేశించిన నూతన ఆర్థిక విధానాల సంస్కరణల నేపథ్యంలో పారిశ్రామిక తిరోగమనంలో భాగంగా గనులు, విభాగాలు మూతపడిపోయాయి. శాంతిఖనితోపాటు 85 డిప్, 65 డిప్, 2 ఇంక్లైన్ గనులు వెలసి కాలనీలు నెలకొన్నాయి. కాల క్రమేణా అన్ని గనులు మూతబడి ఒక్క శాంతిఖని గని మాత్రమే మిగిలింది. గనులతో వెలసిన కాలనీలు తమ మనుగడను కోల్పోయాయి.
కళ తప్పిన కాలనీలకు పూర్వ వైభవం
పారిశ్రామిక కళ తప్పిన కాలనీలకు యం గ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాకతో పూర్వ వైభవంపై ఆశలు చిగురిస్తున్నాయి. 65 ఏరియాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కి 25 ఎకరాల స్థలం కేటాయించారు. ఫలితంగా కాల నీలకు మంచి రోజులు రానున్నాయి. జాతీ య స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన ఇం టిగ్రేటెడ్ స్కూల్ రాకతో అందుబాటులోకి వస్తుంది.ఇంటిగ్రేటెడ్ స్కూల్‌తో ప్రభుత్వ సం క్షేమ, ఉపాధి రంగాలకు దారి సుగమమని ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ భూముల ధరలకు రెక్కలు..
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి 65 డీప్ ఏరియాలో స్థలం మంజూరుతో ఒక్క సారిగా భూముల విలువ అమాంతం పెరిగింది. శాంతిఖని, బస్తీ, 65 డీప్, 85 డీప్, సుభాష్ నగర్ పరిధిలోని సింగరేణి, ప్రభుత్వ భూముల ధరలకు రెక్క లు వచ్చాయి. ఈ మధ్య కాలంలో భూకబ్జాలు ఇక్కడ పెరిగిపోయాయి. కారణం ఇదే... కబ్జాకోరులు, రియల్టర్లు ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాకను గమనించే కాలనీలోని ప్రభుత్వ భూములను, ఖాళీ సింగరేణి క్వార్టర్లను వదలడం లేదు. అనుకున్న రేటుకు ఆక్ర మిత భూములను అమ్ముకుని లక్షలు దండుకుంటున్నారు.
విద్యార్థులకు మహర్దశ...
కార్మిక కాలనీల్లో తిష్ఠ వేసిన కళావిహీనతకు కాలం చెల్లిపోనుందనీ ప్రజలు, బస్తీ వాసులు ఆశిస్తున్నారు. ఇలా కాలగర్భంలో కలసిన సింగరేణి కార్మిక కాలనీలకు ప్రభు త్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ తో మరో అదృష్టం కలిసొచ్చిందనీ చెప్పవ చ్చు. విద్యార్థులకు సైతం వరంలా మారనుం ది. అంపశయ్యపై ఉన్న సింగరేణి కాలనీల కేంద్రంగా ఏర్పడుతున్న సమయంలో బెల్లంపల్లికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ రాకతో రూపురేఖలు మారుతున్నాయి. బెల్లంపల్లికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకువచ్చిన ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు ప్రజలు, ప్రధానంగా కార్మిక కుటుంబాల నుంచి పెద్ద ఎత్తు న హర్షం వ్యక్తమవుతుంది.
నియోజక వర్గ అభివృద్ధ్దిలో భాగంగానే.. -
ఒకప్పుడు కళకళలాడిన బెల్లం పల్లికి తిరిగి పూర్వ వైభవం తీసుకు రావడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నియోజక వర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేయించాం. అందుకు అవసరమైన స్థలాన్ని గుర్తించి నివేదిక పంపించాం. త్వరలోనే ప్రారంభించేందు కు కృషి చేస్తున్న. ఈ పాఠశాల ఏర్పాటుతో మారుమూల మం డలాల్లోని పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందడం తో పాటు బెల్లంపల్లిలోని కార్మిక కాలనీలకు కళ వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేయడమే లక్ష్యంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాం.
గడ్డం వినోద్,ఎమ్మెల్యే బెల్లంపల్లి