25 March, 2026 | 1:36 AM

14 మందికి కఠిన కారాగార శిక్ష

25-03-2026 12:03 AM

కులంపేరుతో దూశించి, గాయపరచి, బెదిరించిన ఒక కేసులో 8 మందికి..

మరో కేసులో 6 మందికి కఠిన శిక్ష

నిజామాబాద్ లీగల్ కరెస్పాండెంట్ మార్చి 24 (విజయ క్రాంతి): ఒక కుటుంబంపై రెండుసార్లు భౌతిక దాడి చేసి, గాయపరచి, కులంపేరుతో దూశించి, బెదిరించిన కేసులలో మొత్తం పదహారు మంది ముద్దాయిలకు వివిధ నేరాలలో కఠిన కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ జిల్లా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి తూముకుంట శ్రీనివాస్ మంగళవారం రెండు క్రిమినల్ కేసులలో తీర్పులు చెప్పినట్లు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ తెలిపారు.     

పై ఆరోపణలతోనే మరో 6 మందికి మరో కేసులో  -నిజామాబాద్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పై అత్యాచారాల విచారణ న్యాయస్థానం స్పెషల్ జడ్జి తూముకుంట శ్రీనివాస్ తీర్పు   వెలువరించరు ఒక స్పెషల్ సెషన్స్ కేసు తీర్పులోని వివరాలు. ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని నాల్గవ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బ్యాంక్ కాలనీ అర్యనగర్ లో నివాసురాలైన మూడుగుల నర్సవ్వ 15,జనవరి 2022 న రాత్రి 8 గంటలకు తన కుటుంబ సభ్యులతో కలిసి పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ ఉండగా మాధవ నగర్ కు చెందిన పల్లపు నర్సింలు మద్యం తాగివచ్చి నర్సవ్వ చిన్న కొడుకు దినేష్ ను భూతుమాటలు తిడుతూ, చేతులతో కొట్టగ స్థానికులు నచ్చజెప్పి ఇంటికి పంపించారు.

మల్లి తేదీ 16 జనవరి, 2022 న ఉదయం పల్లపు నర్సింలు తన బంధువుర్గం అయిన దారంగుల సాయిలు, పల్లపు లక్ష్మణ్, ఆలకుంట పోశెట్టి, పల్లపు సంతోష్, పల్లపు శోభ, పల్లపు రాజమ్మ, ఆలకుంట దశరథ్ లను వెంటబెట్టుకువెళ్లి నర్సవ్వ ఇంటికి వెళ్లి ఇంటి తలుపులు పగులగొట్టి నర్సవ్వ ను భర్త మొగులయ్య,కుమారులు దినేష్, రాహుల్ లను చేతులతో ఇష్టం వచ్చినట్లు కొట్టి గాయపరచ్చారు. కులంపేరుతో దూచించారు.

సదరు నేర ఆరోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో నర్సింలు, సాయిలు, లక్ష్మణ్, పోశెట్టి, సంతోష్, శోభ, రాజమ్మ, దశరథ్ లకు భారత శిక్షస్కృతి సెక్షన్ 324 గారపర్చడంకు గాను మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు.

సెక్షన్ 448 ఇంటిలోకి అక్రమంగా ప్రవేశించడంగాను ఒక సంవత్సరం జైలుశిక్ష,సెక్షన్ 427 ఆస్థి నష్టం కలిగించినందుకుగాను రెండు సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా, సెక్షన్ 506 నేరపూరిత బెదిరింపుకుగాను రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పై అత్యాచారాల నిరోధక చట్టంలోని రెండు సెక్షన్లలో మూడు సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్షలు విధించారు.

మరో క్రిమినల్ కేసులో ఆరుగురికి 

బ్యాంక కాలోనికి చెందిన మూడుగుల మొగులయ్య చిన్న కుమారుడు దినేష్ అదే కాలోనికి చెందిన గంగా అనే యువతిని కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతో అదే కాలోనికి నివాసులైన పల్లపు శోభ, పల్లపు నర్సు, పల్లపు గంగు, పల్లపు శశికళ, పల్లపు నర్సింలు, పల్లపు లక్ష్మణ్ లు ఉమ్మడిగా దినేష్ తండ్రి మొగులయ్య ఇంటికి 21 జనవరి, 2023 న ఉదయం పది గంటలకు వెల్లి మొగులయ్య ను, అతని పెద్ద కుమారుడు రాహుల్ ను కులంపేరుతో దూశించి భూతు మాటలు తిడుతు, చేతులతో కొట్టి గాయపరచి, చంపుతామని బెదిరించారు.

సెల్ ఫోన్ పట్టుకుని ఉన్న శ్రీలత అనే ఆమెను సెల్ ఫోన్ ద్వారా వీడియో తీస్తున్నదని బావించి ఆమె సెల్ ఫోన్ ను లాక్కుని కిందపడవేసి, శ్రీలత ను మురికి కాలువలో నూకి వేశారు. పై నేర ఆరోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు కావడంతో శోభ, నర్సు, శశికళ, నర్సింలు, లక్ష్మణ్ లకు ఒక్కరికి భారత శిక్షస్కృతి సెక్షన్ 324 గాయపరచ్చినందుకుగాను మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా, సెక్షన్ 427 ఆస్థి నష్టం కలిగించినందుకుగాను రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా, సెక్షన్ 506 నేర పూరిత బెదిరింపులు చేసినందుకుగాను రెండు సంవత్సరాల జైలుశిక్షతో పాటు వేయి రూపాయల జరిమానా విధించారు.

షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల పై అత్యాచారాల నిరోధక చట్టంలోని రెండు సెక్షన్లకు గాను మూడు సంవత్సరాల చొప్పున కఠిన జైలు శిక్షలు విధించారు. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని జడ్జి శ్రీనివాస్ తమ తీర్పులో పేర్కొన్నారని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయాకర్ గౌడ్ వివరించారు