విలియమ్సన్ రిటర్మైంట్
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై
16 ఏళ్ల సుధీర్ఘ కెరీక్‌కు వీడ్కోలు
లండన్, జూన్ 12: న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్న కివీస్ జట్టు రెండో టెస్టుకు సిద్ధమవుతోంది.
ఈ సమయంలోనే కేన్ తన రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించడం ఆశ్చర్యానికి గురి చేసింది. వీడ్కోలు మ్యాచ్ గా రెండో టెస్ట్ ఆడేందుకు విలియమ్సన్ మొగ్గుచూపలేదని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఇదే రిటైర్మెంట్‌కు సరైన సమయంగా భావిస్తున్నట్టు కేన్ చెప్పాడు. కొంతకాలంగా రిటైర్మెంట్‌పై ఆలోచిస్తున్నాననీ, 16 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో మధురజ్ఞాప కాలు ఉన్నాయన్నాడు. తనకు మద్ధతుగా నిలిచిన బోర్డుకు, సహచరులకు, కుటుంబసభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.
న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడడం తన అదృష్టంగా భావిస్తున్నాననీ చెప్పాడు. 2010లో భారత్‌పై టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేసిన విలియమ్సన్ తాను ఆడిన తొలి టెస్టులోనే శతకం బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. 16 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో 110 టెస్టులు, 175 వన్డేలు, 93 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 9,515 పరుగులు (33 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు), 175 వన్డేల్లో 7,256 పరుగులు (15 సెంచరీలు, 47 హాఫ్ సెంచరీలు), 93 టీ20ల్లో 2,575 పరుగులు (18 హాఫ్ సెంచరీలు) చేశాడు.
ఇక న్యూజిలాండ్ సారథిగా విలియమ్సన్‌కు అద్భుతమైన రికార్డు ఉంది. అతడి సారథ్యంలో న్యూజిలాండ్ 2019 ప్రపంచకప్ ఫైనల్, 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడింది. ఈ రెండింటిలోనూ కివీస్ రన్నరప్‌గా నిలిచింది. అయితే 2021లో భారత్‌తో జరిగిన తొలి ఐసీసీ టెస్టు చాంపియన్షిప్‌ను గెలిపించి తన దేశానికి తొలి మేజర్ ఐసీసీ టైటిల్‌ను అందించాడు. ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ అభిమానులకు విలియమ్సన్ సుపరిచితుడు. సన్‌రైజర్స్, గుజరాత్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు.






