18 July, 2026 | 2:09 AM

నీట్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ప్రభంజనం

18-07-2026 02:09 AM

125 మెడికల్ సీట్లతో సత్తాచాటిన రిషి మెడికల్ అకాడమీ

మహబూబ్ నగర్ జూలై 17 (విజయక్రాంతి): నీట్ 2026 ఫలితాల్లో రిషి జూనియర్ కాలేజ్ మెడికల్, ఐఐటీ అకాడమీ మరోసారి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. పాలమూరు విద్యా చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే క్యాంపస్ నుంచి 125 మెడికల్ సీట్లు సాధించి తెలంగాణ రాష్ట్రంలోనే సంచలన విజయాన్ని నమోదు చేసింది.

ఈ సందర్భంగా కళాశాల చైర్పర్సన్ చంద్రకళ, డైరెక్టర్ ఎస్. వెంకటయ్య మాట్లాడుతూ, రిషి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారని తెలిపారు. ముఖ్యంగా నుజత్ 555, మనస్విత 545, నందిని రెడ్డి 543, ప్రియాంక 540, భావన 529, సాయి శ్రీ 515, మలిహ కహానియా  511, హప్స మోహిన్  511 మార్కులు సాధించి కళాశాలకు మరింత కీర్తి తీసుకువచ్చారని పేర్కొన్నారు.

విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల విశ్వాసం, అధ్యాపకుల అంకితభావం, సమర్థవంతమైన అకాడమిక్ ప్రణాళిక ఫలితంగానే ఈ అపూర్వ విజయం సాధ్యమైందని వారు తెలిపారు. రిషి విద్యాసంస్థలు భవిష్యత్తులో కూడా మరింత మంది విద్యార్థులను వైద్య విద్యలో ఉన్నత స్థానాలకు చేర్చే లక్ష్యంతో నాణ్యమైన విద్యను అందిస్తాయని స్పష్టం చేశారు. అనంతరం అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను చైర్పర్సన్ శ్రీమతి చంద్రకళ, డైరెక్టర్‌ఎస్. వెంకటయ్య  అభినందించి, వారి ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ అభినందన కార్యక్రమంలో కళాశాల డీన భూపాల్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీ కళ్యాణ్ బాబు , ప్రిన్సిపల్  రాఘవేంద్రరావు  తదితరులు పాల్గొన్నారు.