పెరుగుతున్న హైబీపీ కేసులు
30--45 ఏళ్ల వయసులోనే ముందస్తు పరీక్షలు తప్పనిసరి అని, జీవనశైలి ఒత్తిడే ‘సైలెంట్ కిల్లర్’ హైపర్‌టెన్షన్‌కు ప్రధాన కారణం అని కేర్ ఆస్పత్రి వైద్యులు హెచ్చరిస్తున్నారు. భారతదేశంలో గుండె సంబంధిత రిస్క్ ప్రొఫైల్లో ఆందోళన కలిగించే మార్పులు కనిపిస్తున్నాయని కేర్ హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు.
ఒకప్పుడు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించే హైపర్టెన్షన్ (రక్తపోటు) ఇప్పుడు 30ల ప్రారంభం నుంచే, 40లలోనే ఎక్కువగా గుర్తిస్తున్న పరిస్థితి నెలకొంటోందని కేర్ హాస్పి టల్స్ హైటెక్ సిటీ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ లాలుకోట కృష్ణ మోహన్ వరల్ హైపర్టెన్షన్ డే సందర్భంగా తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి నలుగురు పెద్దల్లో ఒకరికి హైబీపీ ఉండే అవకాశం ఉంది.
కానీ వీరిలో చాలా మందికి వ్యాధి ఉన్నట్టు తెలియకుండానే తీవ్రమైన దశకు చేరుతున్న కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని తెలిపారు. ఇది గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ వ్యాధుల వంటి ప్రాణాంతక సమస్యలకు దారితీస్తోందని వారు హెచ్చరిస్తున్నారు. 40 ఏళ్ల లోపు యసులో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకునే అలవాటు తక్కువగా ఉండటంతో, దాదాపు సగం మంది తమకు హైబీపీ ఉందన్న విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని పేర్కొన్నారు.
పెరుగుతున్న ఒత్తిడి, ఎక్కువ గంటల పాటు కూర్చునే ఉద్యో గ జీవనం, నిద్రలేమి, ఉప్పు అధికంగా ఉన్న ప్రాసెస్డ్ ఆహారం, శారీరక చలనం తగ్గిపోవడం వంటి కారణాలు యువతలో హైబీపీ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా వైద్యులు చెబుతు న్నారు. చాలా సందర్భాల్లో అలసట లేదా స్ట్రెస్గా భావించి నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ఆలస్యంగా గుర్తించబడుతోందని తెలిపారు. హైపర్‌టెన్షన్ వృద్ధాప్య వ్యాధి కాదు.
ఇప్పుడు అత్యంత చురుకైన వయసులోనే, ముఖ్యంగా కెరీర్ పీక్ దశలో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అసలు ఆందోళన కలిగించే విష యం దీని ‘సైలెంట్‌డ్యామేజ్’. గుండె, మెదడు, కిడ్నీలపై దీర్ఘకాలంలో తీవ్రప్రభావం చూపుతుందన్నారు. డయాబెటిస్, ఒబెసిటీ, కుటుం బ చరిత్ర, ధూమపానం, అధిక ఒత్తిడి ఉన్నవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవాలి. ఒక సాధారణ బీపీ పరీక్షే జీవితాన్ని మార్చగలదన్నారు.
నియంత్రణలో లేని హైపర్టెన్షన్ రక్తనాళాలను నెమ్మ దిగా దెబ్బతీస్తుంది. ఇది స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీఫెయిల్యూర్, వాస్క్యులర్ వ్యా ధుల వంటి ప్రాణాంతక సమస్యలకు ప్రమాదాన్ని పెంచుతుంది. భారతదేశంలో నివారిం చగల గుండె సంబంధిత మరణాలకు ఇది ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలుస్తోంది. జీవనశైలి మార్పులే మొదటి రక్షణగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ముందుగానే పరీక్షలు చేయించుకోవాలని, 30 ఏళ్ల తర్వాత సంవత్సరానికి ఒకసారి బీపీ చెక్ చేసుకోవా లన్నారు. ప్రివెంటివ్ కార్డియాక్ ఎటాక్‌పై కేర్ హాస్పిటల్స్ వివరించింది.






