19 April, 2026 | 2:41 AM

యువతలో పెరుగుతున్న లివర్ సమస్యలు

19-04-2026 01:05 AM
  1. ప్రతీ ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్
  2. అధిక ప్రమాదంలో ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు 
  3. ముందస్తు గుర్తింపు పరీక్షలే కీలకం
  4. నేడు వరల్డ్ లివర్ డే సందర్భంగా కేర్ ఆస్పత్రి వైద్యులు

హైదరాబాద్, 18 ఏప్రిల్ (విజయక్రాం తి): ఇప్పటివరకు వృద్ధుల్లో ఎక్కువగా కనిపించిన లివర్ సమస్యలు ప్రస్తుతం 30 నుం చి 50 ఏళ్ల మధ్య వారిలో కూడా వేగంగా పెరుగుతున్నాయని, ప్రతి ముగ్గురిలో ఒకరికి ఫ్యాటీ లివర్ సమస్య అవకాశం ఉందని కేర్ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. గంటల తరబడి కూర్చునే ఉద్యోగాలు, సమయానికి భోజనం చేయకపోవడం, ఫాస్ట్ ఫుడ్ అలవా ట్లు, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం,

ఇలా జీవన శైలిలో మార్పులు లివర్‌పై ప్రభావం చూపుతున్నాయని, కార్పొరేట్ ఉద్యోగుల్లో ఈ సమస్య అధికంగా కనిపిస్తుందని, బీపీ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ ప్రమా దం మరింత ఎక్కువగా ఉంటుందని కేర్ ఆసుపత్రి సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్‌రామాసాగర్ విద్యాసాగర్ తెలిపారు. లివర్ వ్యాధి అనేది నిశ్శబ్ధ స్వభావం కలిగిందన్నారు. ప్రారంభంలో నొప్పి, ఇబ్బంది కని పించదని, పరీక్షల్లో లివర్ డ్యామేజ్ బయటపడుతుందన్నారు.

కొందరు చిన్న సమస్య ఉన్నప్పుడే ఆసుపత్రికి వచ్చి బయటపడుతుంటే, మరికొందరేమో పరిస్థితి తీవ్రదశకు చేరుకున్నాక వస్తున్నారని తెలిపారు. అలాం టి సమయంలో సిరోసిస్, లివర్ ఫెయిల్యూర్ వంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురవు తున్నాయని, చికిత్స క్లిష్టమై ఖర్చు పెరుగుతుందని, ఇది జీవన నాణ్యతపై ప్రభావం పడుతుందని అన్నారు. పరీక్షల్లో అడ్వాన్స్‌డ్ లివర్ డ్యామేజ్ బయటపడుతోంది.

కేవలం లివర్ ఫంక్షన్ టెస్ట్ మాత్రమే సరిపోదు. పూ ర్తి స్థాయి పరీక్షలు అవసరం. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, అవసరమైతే ఫైబ్రోస్కాన్ ద్వా రా లివర్లో కొవ్వు, గట్టితనం అంచనా వే యాలి. ప్రారంభ దశలో గుర్తిస్తే ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నియంత్రించవచ్చు. కొ న్ని సందర్భాల్లో పూర్తిగా తగ్గించవచ్చు. కానీ ఆలస్యం అయితే పరిస్థితి తీవ్రమై ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కూడా రావచ్చని కేర్ హా స్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్  హెపటోబిలియరీ అండ్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్ట ర్ సోనల్ అస్తనా తెలిపారు.

పెరుగుతున్న సమస్యను దృష్టిలో ఉంచుకొని కేర్ ఆసుపత్రి సమగ్ర వైద్యవిధానాన్ని అమలుచే స్తోం దని ప్రారంభదశ నుంచే గుర్తించి చికిత్స అందించే విధంగా వ్యవస్థను రూపొందించారు. ముందస్తు గుర్తింపు, సమయానికి చి కిత్స, జీవనశైలి మార్పులు, ఈ మూడు అం శాలపై ప్రత్యేకదృష్టి పెట్టినట్లు వైద్యులు తెలిపారు. 30 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ ప్రతీ ఏడాది లివర్ పరీక్షలు చేయించుకోవాలి.

అలసట, ఆకలి లేకపోవడం, అనూ హ్యంగా బరువు, పొట్టచుట్టూ కొవ్వు పెరగడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడ దు. స్వయంగా మందులు తీసుకోవడం, సప్లిమెంట్స్ అధికంగా వాడటం కూడా లివర్‌పై ప్రభావం చూపుతుంది. వైద్యుల సలహా లేకుండా దీర్ఘకాలంగా మందు లు వాడటం వల్ల కూడా లివర్ డ్యామేజ్ వచ్చే ప్రమాదం ఉందని సీనియర్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కుమారస్వామి సూచించారు.

వ్యా యామం, ఆహారం ఎంపిక, మద్యం తీసుకోకపోవడం వంటి అలవాట్లు దీర్ఘకాలంలో మంచి ఫలితాలు ఇస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఈ వరల్డ్ లివర్ డే సందర్భంగా కేర్ ఆసుపత్రి ప్రజలకు స్పష్టమైన సందేశం ఇస్తోంది. లివర్‌సమస్యలు మౌనంగా వస్తా యి, కానీ గుర్తించకపోతే ప్రాణాలకు ముప్పు. ముందస్తు పరీక్షలే రక్షణ.