పారిశ్రామిక ప్రాంతంలో పెరుగుతున్న రౌడీయిజం
- ఆటో డ్రైవర్‌ను అడ్డగించి చితకబాదిన దుండగులు
- పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు
భద్రాద్రి కొత్తగూడెం, మే 29, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచ పట్టణంలో రౌడీయిజం పెట్రేగి పోతుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. అనునిత్యం ఎక్కడో ఒకచోట గలాటాలు చోటు చేసుకున్న వెలుగులోకి రావడం లేదు, తాజాగా ఓ ఆటో డ్రైవర్ ను దుండగులు అడ్డగించి చితక బాదిన సంఘటన వెలుగు చూసింది. స్థానిక వికలాంగుల కాలనీకి చెందిన పోతురాజు నవీన్ పై జరిగిన దాడి తీవ్ర ఉదృతక్కకు దారితీసింది. తీవ్ర గాయాల పాలైన నవీన్ పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నవీన్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ , పాత కక్షాల నేపథ్యంలోనే ఈ దాడి చోటు చూసుకుందని బాధితుడు ఆరోపిస్తున్నాడు.
సాగర్ అనే వ్యక్తి ప్రేరేపనతో నజీర్ తనపై దాడికి పాల్పడినట్టు బాధితుడు ఆరోపిస్తున్నాడు. దారి అడ్డగించి విచక్షణారహితంగా కొట్టారని, ప్రాణహాని కలిగించేలా దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరుతూ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పట్టణ ఎస్త్స్ర నాగరాజు కేసు నమోదు చేస్తే రేపు చేస్తున్నారు.






