యువతలో పెరుగుతున్న పొగాకు వ్యాధులు
క్యాన్సర్ కేసులు: కేర్ వైద్యుల హెచ్చరిక
హైదరాబాద్, మే 30(విజయక్రాంతి): ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు దే శంలో పెరుగుతున్న పొగాకు సంబంధిత వ్యాధులపై ఆందోళన వ్యక్తం చేశారు. ము ఖ్యంగా యువతలో తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని హెచ్చరించారు. ఈ ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన థీమ్ ‘ఆకర్షణ ముసుగును తొలగిద్దాం నికోటిన్, పొగాకు వ్యసనానికి అడ్డుకట్ట వేద్దాం’. పిల్లలు, యువతను ఆకర్షించేందుకు పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల తయారీ సంస్థలు ఫ్లేవర్డ్ ఉత్పత్తులు, వేపింగ్ పరికరాలు, నికోటిన్ పౌచ్లు, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి మార్గాలను వినియోగిస్తున్నా యని ఈ థీమ్ ప్రాధాన్యంగా చర్చిస్తోంది.
ఈ సందర్భంగా కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్‌లో క్లినికల్ డైరెక్టర్, హెచ్‌ఓడీ, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ జయచంద్ర మాట్లాడుతూ ‘నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఊపిరితిత్తుల పనితీరు తగ్గిపోవడం, ఆస్తమా తీవ్రత పెరగడం, ప్రారంభ దశ సీఓపీడీ (దీర్ఘకాలిక ఊపిరితిత్తుల అవరోధ వ్యాధి) వం టి సమస్యలతో యువత ఆస్పత్రులకు వస్తు న్న సంఖ్య పెరుగుతోంది. పొగ తాగడం వల్ల ఊపిరితిత్తుల నష్టం చాలా ఏళ్ల తర్వాతే వ స్తుందని చాలామంది భావిస్తారు.
కానీ దాని ప్రభావం చాలా ముందుగానే ప్రారంభమవుతుంది. లక్షణాలు కనిపించే సమయానికి తిరిగి సరిచేయలేని స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది’ అని తెలిపారు. కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీకి చెందిన సీనియర్ కన్స ల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ యుగంధర్‌రెడ్డి మాట్లాడుతూ మొత్తం క్యాన్సర్ కేసు ల్లో దాదాపు మూడోవంతు పొగాకు వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఏ వయసులోనైనా పొగాకు మానేస్తే క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుందన్నారు.
పరోక్ష ధూమపానం వల్ల కూడా తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ నిపుణులు పొగాకు మానాలనుకునే వారు కౌన్సెలింగ్, బిహేవియరల్ థెరపీ, నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ, వైద్య స హాయం వంటి సేవలను వినియోగించుకోవాలన్నారు. ‘పొగాకు వల్ల కేవలం వినియో గదారులకే నష్టం జరుగుతుందని అనుకోవడం పెద్ద అపోహ. ఇది కుటుంబాలు, కార్యాలయాలు, ఆరోగ్య వ్యవస్థ, దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఎంత త్వరగా పొగాకు మానేస్తే అంత ఎక్కు వ ఆరోగ్య ప్రయోజనాలుంటా యి. సరైన వైద్య సహాయం, మార్గదర్శకతతో పొగాకు వ్యసనం నుంచి బయటపడటం పూర్తిగా సా ధ్యమే’ అని డాక్టర్ జయచంద్ర పేర్కొన్నారు.






