మంచిరామి గ్రామంలో దేవతలకు జలాభిషేకం
22-06-2026 12:00 AM
సుల్తానాబాద్ , జూన్ 21 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచిరామి గ్రామంలో గ్రామ సర్పంచ్ ఉప్పు లక్ష్మి, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఉప్పు తిరుపతి ఆధ్వర్యంలో ఆదివారం గ్రామ దేవతలకు జలాభిషేకం, ప్రత్యేక అభిషేక కార్యక్రమలు నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ శ్రేయస్సు, ప్రజల సుఖసంతోషాలు, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, గ్రామ మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలనునిర్వహించారు.






