22 June, 2026 | 3:00 AM

రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం

22-06-2026 12:00 AM
  1. ఏడు రకాల వడ్లకే బోనస్ ఇస్తామనడం సరికాదు
  2. రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి
  3. బిఆర్‌ఎస్ నాయకుల డిమాండ్

ముస్తాబాద్,జూన్ 21(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బిఆర్‌ఎస్ కార్యాలయంలో పార్టీ మండల పట్టణ అధ్యక్షులు సురేందర్ రావు, నరసింహారెడ్డి ఆధ్వర్యంలోకాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న వ్యతిరేక వైఖరి పట్ల ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల విద్యుత్తు ఇవ్వడం లేదని,రైతుబందు ప్రతి ఎకరానికి 15 వేలు ఇస్తామని చెప్పి మోసపూరిత మాటలు మాట్లాడి ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని పేర్కొన్నారు.

33 రకాల వడ్లకు బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం ఏడు రకాల వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామనడం కేంద్రం చెప్పినట్లు కొంటామని రైతులను అయోమయానికి గురి చేయడం సమంజసం కాదన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. సకాలంలో ఎరువులు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి,ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ కో అప్షన్ మెంబర్ సర్వర్ పాషా,మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య,నాయకులు కొండ శ్రీనివాస్,సంతోష్ రావు మల్లేశం యాదవ్,మండల యూత్ అధ్యక్షుడు శీలం స్వామి,చంద్రారెడ్డి, రాజు, వెంకటేష్,భరత్, పోతుగల్ గ్రామశాఖ అధ్యక్షుడు బాల్ నర్సు,సోషల్ మీడియా వారియర్స్ వెంకటేష్,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.