03-12-2025 09:18:22 AM
తూప్రాన్,(విజయ క్రాంతి): తూప్రాన్ మండలం లోని కోనాయిపల్లి సర్పంచ్ అభ్యర్థి బయ్యారం రామలక్ష్మి సుధాకర్ గౌడ్ నామినేషన్ ను మండల సమీకృత భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పత్రాలను సమర్పించడం జరిగింది. గతంలో పలుమార్లు సర్పంచ్ బరిలో నిలుచున్న వ్యక్తి, గ్రామ ప్రజలు బలపరిచిన వ్యక్తి. గ్రామ ప్రజలకు సేవ చేసే కోణంలో మరోమారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉండడం జరిగిందన్నారు. గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించాలని అవకాశం కల్పించాలని కోరినారు.