calender_icon.png 15 September, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెల పంపిణీ స్కాం.. కొనసాగుతున్న ఈడీ దర్యాప్తు

15-09-2025 12:17:05 PM

హైదరాబాద్: గొర్రెలు పంపిణీ కుంభకోణం(Sheep Distribution Scam) కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసు బాధితులు ఈడీ(ED investigation ) కార్యాలయానికి చేరుకున్నారు. ఏపీ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు మధ్యవర్తులు ఎగవేసినట్లు గుర్తించారు. మధ్య వర్తులు రూ. 2 కోట్లు ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. గుంటూరు, పల్నాడుకు చెందిన రైతుల వాంగ్మూలాలను ఈడీ నమోదు చేసింది. పశుసంవర్ధక శాఖ ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. సోదాల్లో కీలక మైన ఆధారాలను ఈడీ అధికారులు సేకరించారు.