calender_icon.png 15 September, 2025 | 1:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ పహారాలో యూరియా పంపిణీ

15-09-2025 11:50:40 AM

చిట్యాల మన గ్రోమోర్ ముందు రైతుల  క్యూ లైన్.

చిట్యాల(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) చిట్యాల మండలకేంద్రంలోని మన గ్రోమోర్ కేంద్రం వద్ద సోమవారం పోలీస్ పహార మధ్య యూరియా పంపిణీ కొనసాగుతోంది.గత నెల రోజులుగా చిట్యాల మండలంలో యూరియా కొరత తీవ్రంగా వేదిస్తోంది. రైతులకు సరిపడా యూరియా నిలువలు లేకపోవడంతో ఇటీవలే రైతు ఆగ్రోస్,ఓడిసిఎంఎస్, నైన్ పాక ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాల వద్ద రైతులు క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షించిన విషయం తెలిసిందే. తాజాగా  ఉదయం నుంచి  మన గ్రోమోర్ కేంద్రం ఎదుట యూరియా కోసం రైతులు బారులు తీరగా పోలీసులు అక్కడే ఉండి అల్లర్లు కాకుండా యూరియాను రైతులకు సరఫరా చేయడంలో సహకరిస్తున్నారు.కాగా వ్యవసాయానికి సరిపడా యూరియా అందించడం లేదని,తక్షణమే అధికారులు స్పందించి సరిపడా యూరియాను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు.