calender_icon.png 15 September, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే కృషితోనే మరమ్మత్తు పనులు

15-09-2025 11:33:33 AM

టీపీసీసీ అధికార ప్రతినిధి అనపర్తి .జ్ఞాన సుందర్

తుంగతుర్తిలో సబ్ కోర్టు, అడిషనల్ కోర్టు ఏర్పాటు చేయాలి.

తుంగతుర్తి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల(Thungathurthy mandal) కేంద్రంలోని మద్దిరాలకు వెళ్లే ప్రధాన రహదారి బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డు గుంతలు ఏర్పడి భారీ వర్షాలకు నీటితో నిండిపోయి వాహనదారులకు, ప్రయాణికులకు నరకం చూపించింది. ఈ సమస్యపై టీ పీసీసీ అధికార ప్రతినిధి, తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు(President of Thungathurthy Bar Association) అన్నేపర్తి జ్ఞాన సుందర్ ఎప్పటికప్పుడు సమస్యను ముఖ్యమంత్రి, మంత్రి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ,స్పందించిన అధికారులు ఆదివారం సాయంత్రం పనులు చేపట్టడంతో ఎట్టకేలకు రోడ్డు మరమ్మత్తులకు మోక్షం లభించింది. అంబేద్కర్ విగ్రహం నుండి కోర్టు వరకు 9 వందల మీటర్లు సుమారు 4 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా సోమవారం హర్షం వ్యక్తం చేస్తూ జ్ఞాన సుందర్ మాట్లాడారు. తుంగతుర్తి మండల కేంద్రంలోని రోడ్డులను మరమ్మత్తు చేయడమే కాకుండా నియోజకవర్గంలోని పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అద్వానంగా ఉన్నాయని వాటిని కూడా ముఖ్యమంత్రి, మంత్రి ఎమ్మెల్యే స్పందించి మరమ్మత్తులు చేయాలని కోరారు. అదేవిధంగా తుంగతుర్తి లో ఉన్న జూనియర్ సివిల్ కోర్టుకు కేసుల భారం ఎక్కువ అవుతుండడంతో సూర్యాపేట కోర్టుకు వెళ్లవలసిన దుస్థితి ఏర్పడిందని వాటిని అధిగమించడానికి వెంటనే సబ్ కోర్టు, అడిషనల్ కోర్టు ఏర్పాటు చేస్తూ కోర్టు భవన నిర్మాణానికి టెండర్ నోటీస్ కు ఆర్ అండ్ బి  శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారసోసియేషన్ ఉపాధ్యక్షులు కారింగుల వెంకటేశ్వర్లు, న్యాయవాదులు భాష బోయిన వేణు రాజ్, మల్లెపాక రవికుమార్, సైదులు, వంగాల నాగరాజు, జవాది సైదులు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పోయిన అజయ్, శ్రీకాంత్ నాయుడు,బత్తుల జలంధర్, బొంకూరి నాగయ్య, కోట రామస్వామి, దేవేందర్, రమేష్, పులుసు సత్యం తదితరులు పాల్గొన్నారు.