15-09-2025 11:00:20 AM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీ బస్సులో ఒకేసారి మంటలు(RTC buses catch fire) చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుండి దింపివేయడంతో పెను ప్రమాదమే తప్పింది. సోమవారం ఆదిలాబాద్ నుండి 40 మంది ప్రయాణికులతో నిజామాబాద్ వెళ్తున్న బస్సు ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద బస్సులో నుండి ఒక్కసారిగా పొగతో పాటు మంటలు చెలరేగాయి. అటువైపుగా వెళుతున్న మినరల్ వాటర్ ఆటోను ఆపి నీటితో మంటలు అదుపు చేయడానికి కొందరు ప్రయత్నించిన మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ స్టేషన్ సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి హుటాహుటిగా చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అతికిలోకి తీసుకొచ్చారు