15-09-2025 11:47:27 AM
హైదరాబాద్: హనుమకొండలో స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య(Thatikonda Rajaiah) సుబేదారి పోలీసులు గృహనిర్బంధం చేశారు. రఘునాథపల్లి మండలంలో రాజయ్య పర్యటన దృష్ట్యా గృహనిర్భంధం చేశారు. కడియం శ్రీహరిపై రాజయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి(Kadiyam Srihari) రాజయ్య క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రాజయ్యను అడ్డుకుంటామని కాంగ్రెస్ నేతలు పిలుపుతో రంగంలోకి దిగిన పోలీసులు రాజయ్యను ఇంట్లో నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ... బీఆర్‌ఎస్ నేతలపై అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. రైతుల కోసం తాను చేపట్టిన పోరాటాన్ని ఎన్ని అడ్డుంకులు వచ్చిన ఆపేది లేదని, రైతుల కోస తన పోరాటం కొనసాగుతోందని తేల్చిచెప్పారు. రాజయ్యను గృహనిర్బంధం చేశారన్న విషయం తెలుసుకున్న పార్టీ నేతలు ఆయన నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది.