గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం
విద్యుత్ స్తంభానికి ఢీకొన్న కారు
సింగరేణి కార్మికుడు మృతి, ఒకరి పరిస్థితి విషమం, ఇద్దరికీ గాయాలు
గోదావరిఖని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని గోదావరిఖనిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తోటి ఉద్యోగి పదవి విరమణ వేడుకకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొని సింగరేణి ఉద్యోగి వేల్పుల శ్రీధర్ (40) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు సింగరేణి ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం గోదావరిఖనిలో తెల్లవారుజామున జరిగింది.
స్థానికులు, మృతుని బంధువుల కథనం ప్రకారం జక్కుల సమ్మయ్య అనే సింగరేణి ఉద్యోగి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం స్థానిక ఆర్ సిఓఏ క్లబ్ లో నిర్వహించ గా జీడీకే -1 ఇంక్లైన్ లో పనిచేసే సింగరేణి ఉద్యోగి మాలోత్ శ్రీకాంత్ కారులో అదే గని లో పనిచేసే తడకల మహేందర్, ఎన్.లక్ష్మణ్ తో పాటు అదే గని లో గతం లో పని చేసి ఇటీవలే జీడీకే -11 ఇంక్లైన్ కు బదిలీ అయిన సర్వే చైన్ మాన్ గా పని చేసే మార్కండేయ కాలనీకి చెందిన ఏల్పుల శ్రీధర్ (40) వెళ్ళి తిరిగి వస్తున్న క్రమంలో రాజేష్ థియేటర్
నుంచి మున్సిపల్ కార్యాలయ మెయిన్ రోడ్ కు వస్తున్న క్రమంలో కారు అతి వేగంగా వచ్చి టర్నింగ్ పై ఉన్న డివైడర్ ను ఢీకొట్టి, ప్రక్కనే ఉన్న చెట్టుకు ఢీ కొట్టడంతో కారు వెనకాల కూర్చున్న ఎల్పుల శ్రీధర్ (40) అక్కడికక్కడే మృతి చెందగా కారు నడుపు తున్న శ్రీకాంత్ తో పాటు కారు లో ఉన్న మహేందర్, లక్ష్మణ్ లు గాయాల పాలయ్యారు. స్థానికుల సమాచారం తో ప్రైవేట్ అంబులెన్సు లో పోలీస్ లు ఈ ముగ్గురిని కరీంనగర్ లో ని వేర్వేరు ప్రైవేట్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స నిమిత్తం తరలించ గా లక్ష్మణ్ పరిస్థితి ఆందోళన కరంగా ఉన్నట్లు తెలిసింది.




