17 April, 2026 | 10:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

గోదావరిఖనిలో ఘోర ప్రమాదం

05-06-2025 08:36 AM

విద్యుత్ స్తంభం ను ఢీ కొట్టి బడి గోడ ఎక్కిన కారు

 తెల్లవారుజామున  ఘటన

గోదావరిఖని,(విజయక్రాంతి): గోదావరిఖని(Godavarikhani) పరశురాం నగర్ బోర్డు నుంచి తిలక్ నగర్ కు వెళ్లే మార్గమధ్యంలో భారత్ యూత్ పక్కన గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో అతి వేగంగా వచ్చిన కారు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి ఆ పక్కనే గల ప్రభుత్వ పాఠశాల ప్రహరీ గోడ పైకి ఎక్కింది. కారులో ఇద్దరు యువకులు ఉన్నట్లు తెలిసింది. తీవ్ర గాయాలతో ఉన్న వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు  స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందోనని స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.