23 June, 2026 | 11:24 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

నాలుగేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యం

20-03-2026 11:28 AM

ఫోక్సో కేసు నమోదు 

అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో(Aswaraopeta) ఓ నాలుగేళ్ల చిన్నారిపై బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబందించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మున్సిపాలిటి పరిధిలోని ఓ వార్డుకు చెందిన ముక్కుపచ్చలారని చిన్నారిని అదే ఇంటికి ఎదురుగా ఉండే 14 ఏళ్ల బాలుడు ఆడిస్తానని బుధవారం ఇంట్లోకి తీసుకెళ్లాడు.

చిన్నారి ఇంటికి వచ్చాక నలతగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆరా తీశారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు ఒక్కసారిగా హతాసులయ్యారు. ఘటనపై చిన్నారి తాత బాలుడి ఇంటికి వెళ్లి నిలదీయంతో ఎదురుగా దాడికి దిగారు. దీంతో విషయం పూర్తిగా వెలుగులోకి రావటంతో చిన్నారి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు బాలుడిపై గురువారం ఫోక్సో కేసు(POCSO Act) నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు