calender_icon.png 9 November, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్, ఆటో ఢీ.. ఒకరు మృతి

09-11-2025 08:28:14 PM

ఇద్దరికి గాయాలు..

మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న బైక్ ఆటో ఢీకొనడంతో ఒకరి మృతిచెందగా ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన మరిపెడ మండలం జాతీయ రహదారి 365 బుర్హన్ పురం గ్రామ శివారులో రైతు వేదిక వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం ఇటికలపాడు గ్రామ పంచాయతీకి చెందిన చందు తన స్నేహితుడితో కలిసి బైక్ నడుపుతూ బుర్హన్ పురం నుంచి మరిపెడ మండల కేంద్రం వైపు వెళుతున్నాడు.

ఈ క్రమంలో అటువైపుగా వస్తున్న ఆటోను బైక్ ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల ఇటికలపాడు గ్రామపంచాయతీకి చెందిన శివరాత్రి చందు(28) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన క్షతగాత్రుడిని 108లో మహబూబాబాద్ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.