calender_icon.png 9 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరామర్శ

09-11-2025 08:25:15 PM

కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ లో ఇటీవల మృతి చెందిన సకారాం మహారాజ్..

కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన నాయకులు..

కుభీర్ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని బ్రహ్మేశ్వర్ గ్రామానికి చెందిన సకారాం మహారాజ్ మృతి తీరని లోటని మహారాజ్ కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ముధోల్ మాజీ ఎమ్మెల్యే జీ. విఠల్ రెడ్డి భరోసా కల్పించారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం బ్రహ్మేశ్వర్ లో ఆదివారం ఆయన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడి చిత్రపటం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.

సక్కారాం మహారాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని, అయన కుటుంబ సభ్యులకు ధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈయన వెంట కుభీర్ మార్కెట్ కమిటీ ఛైర్మెన్ గోనె కళ్యాణ్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహన్, కుభీర్ సర్పంచ్ పానాజీ విజయ్ కుమార్, దత్తురాము కాక, దేవేందర్, రోహిదాస్, ఆత్మరామ్, నాయకులు కదం దత్తురామ్, బెల్లాల గంగాధర్, వై. మిలింద్, లక్ష్మీకాంత్, గ్రామస్తులు ఉన్నారు.