5 March, 2026 | 1:25 AM

రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

05-03-2026 12:10 AM

మేళ్లచెరువు మార్చి 4:  మేళ్లచెరువులోని చెక్ పోస్ట్ బజార్ వద్ద నుండి దాదాపు ఒకటిన్నర కిలోమీటర్ వరకు, నిర్మాణం చేయనున్న సిసి రోడ్డు పనులకు బుధవారం సర్పంచ్ బచ్చు పద్మావతి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. చెకపోస్ట్ బజార్ వద్ద నుండి ఇందిరమ్మ కాలనీ వరకు, సిసి రోడ్డు పనులు పూర్తి చేస్తామనిసర్పంచ్ తెలిపారు. రోడ్డు నిర్మాణ పనులకు గ్రామపంచాయతీ జనరల్ ఫండ్స్, 15వ ఫైనాన్స్ నిధులను ఖర్చు చేయునట్లు ఆమె తెలిపారు.