రాహుల్‌ను మూడు సార్లు ప్రజలు తిరస్కరించారు
05-03-2026 12:11 AM
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ట్వీట్
హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రజలు మూడు సార్లు తిరస్కరించారని, అయినా దేశం కోసం ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన ఏ ముఖంతో చెప్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని పదే పదే తిరస్కరించారని తెలిపారు.
ప్రజా స్వామ్యంలో ఉండాల్సింది ఆయన సంకల్పం కాదు...ప్రజల సంకల్పం ముఖ్యమన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 90కిపైగా ఎన్నికల్లో ఓడిపోయిందని, ఓ జాతీయ మీడియాలో వచ్చిన కథనానికి గానూ రాంచం దర్ రావు ఈ విధంగా స్పందిచారు.




