calender_icon.png 17 November, 2025 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు విస్తరణ పనులు షురూ

17-11-2025 01:39:17 AM

  1. జోరుగా సాగుతున్న  బీజాపూర్-హైదరాబాద్ హైవే రోడ్డు పనులు

ప్రమాదంతో కదిలిక.. నేషనల్ హైవే అధికారులు, పాలకులు

ప్రస్తుతం ఉన్న రహదారిపై బీటీతో  మరమ్మతులు, ఇరువైపులా ముమ్మరంగా చదును చేసే పనులు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు నూతనంగా నిర్మించతలపెట్టిన రోడ్డు పనులు పరీశీలన చేసిన ఎమ్మెల్యేలు యాదయ్య, రాంమోహన్ రెడ్డి

చేవెళ్ల, నవంబర్ 16( విజయక్రాంతి): హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో మొయినాబాద్, చేవెళ్లలో బైపాస్ రోడ్డు పనులు ఒక వైపు. చేవెళ్ల, మొయినాబాద్, వికారాబాద్ జిల్లా పరిధిలో హైవే రోడ్డు పక్కన చదును చేసే పనులు జరు గుతున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

46కిలోమీటర్లు ..రూ.928 కోట్లు ..

హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తర ణకు కేంద్రం 2015లో నిధులు విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నాలుగు వరుసల రోడ్డుగా విస్తరణకు రూ.928 కోట్ల నిధులు విడుదలయ్యాయి. గత ప్రభుత్వంలో భూసేకరణ, సర్వేలు అంటూ ఆలస్యం చేయటంతో, ఈ రోడ్డుపై ఉన్న చెట్లను తొలగించొద్దంటూ పర్యావరణ ప్రేమికులు గ్రీన్ ట్రిబ్యూనల్ కేసులు వేయటంతో పనులకు ఇన్నేళ్లుగా బ్రేకులు పడుతూ వచ్చాయి.

దాదాపు పదేళ్లుగా ఈ రోడ్డుపై అనేక ప్రమాదాలతో వందల మంది మృత్యువాతపడ్డారు. గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్టులో ఉన్న స్టే ఎత్తివేసిందని ప్రకటించిన రెండు రోజుల్లోనే చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు-కంకర టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమా దంలో 19 మంది మృతి చెందగా.. 27 మంది కిపైగా గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రాష్ట్రంలోనే పెను విషాదంగా మారింది. ఈ దీంతో ఈ రోడ్డు జాప్యంపై తీవ్ర విమర్శలు. ప్రభుత్వాల, నాయకుల, అధికారుల తీరుపై ప్రజలు ఎదురు దాడికి దిగారు. 

యుద్ధ ప్రాతిపదికన పనులు.. 

కేసు కూడా తొలిగిపోవడం, రహదారి పై  ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అదికారులు ఆదేశించారు. ప్రమాదం జరిగిన మరు సటి రోజు నుంచే ఈ పనులు జోరుగా కొనసాగు తున్నాయి. చేవెళ్ల, మొయినాబాద్, ఆటూ వికారా బాద్ జిల్లా పరిధిలోని పూడూర్, కండ్లపల్లి ప్రాంతం. వరకు రోడ్డు చదును చేసే పనులు చేపట్టారు. ప్రస్తుతం ఉన్న రోడ్డుపై ఏర్పడిన గుంతలను బీటీ వేసి పూడ్చి వేసే పనులు సైతం జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా రోడ్డు పనులు త్వరగా పూర్తిచేయించి ప్రమాదాలు జరగకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు.అయితే ఔటర్ రింగ్ రోడ్డు పోలీస్ అకాడమీ నుంచి మన్నెగూడ వరకు 46 కి.మీ. నాలుగు వరుసల రోడ్డుగా విస్తరణ పనులు చేవెళ్ల ఎమ్మెల్య కాలె యాదయ్య, పరిగి ఎమ్మెల్యే రాంమోహ్మన్రెడ్డి కాంగ్రెస్ ప్రతనిధులను తమ వెంట తీసుకుని నూతనంగా నిర్మించతలపెట్టిన రోడ్డు పనులు పరీశీలన చేశారు. పెద్ద కాన్వాయ్ చేసుకుని నూతనంగా తవ్విన రోడ్లపై కాన్వాయ్ను తిప్పారు. 

చర్యలు తీసుకుంటున్నాం

బీజాపూర్ హైవే విస్తరణ పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైన రైతు లకు గానీ, ఇతర భూ యజమా నులకు పరిహారం రాకపోయినా, ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తాం, పరిహారం దాదాపు అందరికీ వచ్చింది. సర్వే చేసిన హద్దు వరకు రోడ్డు పనులు చేసుకోవాలని సూచించాం.

చంద్రకళ, -- ఆర్డీవో, చేవెళ్ల వేగంగా పూర్తి చేయిస్తాం

హైవే రోడ్డు విస్తరణ పనులు జోరందుకు న్నాయి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించాం. కాంట్రాక్టర్కు ఇచ్చిన సమయం కంటే ముందుగానే రోడ్డు పనులు చేయించేలా కృషి చేస్తున్నాం.

కాలె యాదయ్య, ఎమ్మెల్యే చేవెళ్ల