రహదారి భద్రత నిబంధనలు పాటించాలి
ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు
మంచిర్యాల, ఏప్రిల్ 13 (విజయక్రాంతి) : వాహనదారులు రహదారి భద్రతా నిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తూ సురక్షితం గా గమ్యస్థానాలకు చేరుకోవాలని -ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భా గంగా సోమవారం జిల్లాలోని హాజీపూర్ మం డలం రాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన అరవై - అలైవ్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డిసిపి ఎగ్గడి భాస్కర్, ఏ సి పి ప్రకాష్, జిల్లా రవాణా అధికారి, హాజీపూర్ మండల తహసిల్దార్ పుష్పలత లతో కలిసి హాజరై ఆయన మాట్లాడారు.
పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజలు స్వచ్ఛందంగా భాగస్వామ్యలై వాహనాలను నిబంధనలకు లోబడి జాగ్రత్తగా నడపాలని తెలిపారు. అతివేగం చాలా ప్రమాదమని, అనుభవానికి ప్రమాదానికి సంబంధం లేదని, వేగం పరిమితిలో ఉండి నిబంధనలు పాటించినట్లయితే గమ్యస్థానానికి చేరుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.






