calender_icon.png 20 January, 2026 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి

20-01-2026 06:05:02 PM

తుంగతుర్తి ఎస్సై క్రాంతి కుమార్

తుంగతుర్తి( విజయ క్రాంతి): రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని ఎస్సై కాంత్ కుమార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తుంగతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు సూచనలతో అరైవ్.. ఆలైవ్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా వద్ద ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్‌ బెల్ట్ కట్టుకోవాలని సూచించారు. అధిక వేగం, మద్యం సేవించి, ఫోన్ మాట్లాడుతూ  వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.ట్రాఫిక్ నిబంధనలను గౌరవించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారి తీస్తుందని ప్రజలను హెచ్చరించారు.

ప్రమాదం సంభవించగానే మొదటగా స్పందించి ప్రాణాలు కాపాడిన వారికి రాష్ట్ర పోలీస్ శాఖ రూ.25000 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించిందన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో  పోలీస్ సిబ్బంది విజయలక్ష్మి, రాంబాబు, రాజు బుచ్చి రాములుతో పాటు జర్నలిస్టులు, వాహనదారులు, స్థానిక ప్రజలు పాల్గొని రోడ్డు భద్రత నియమాలను పాటించాలనే సంకల్పం వ్యక్తం చేశారు.