16 April, 2026 | 2:00 AM

రోడ్డు భద్రత నియమాలను పాటించాలి

16-04-2026 12:26 AM
  1. వాహనదారుల పిల్లలకు హెల్మెట్లు పంపిణీ
  2. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం
  3. చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు

ముషీరాబాద్,ఏప్రిల్ 15(విజయక్రాంతి): రోడ్డు భద్రతా నియమాలను పాటించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని చిక్కడపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు పిలుపునిచ్చారు. ఈనెల13 నుండి18 వరకు జరిగే అరైవ్ అండ్ అలైవ్  ప్రచారంలో భాగంగా ప్రజా పాలన ప్రగతి ప్రణాలికలో బుధవారం చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద  పిల్లల రోడ్డు భద్రతా దినోత్సవం  కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు మాట్లాడుతూ ద్విచ క్ర వాహనాలపై ప్రయాణం చేసే వారితో పాటు చిన్న పిల్లలకు కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించ కుండా ప్రయాణం చేయరాదని పేర్కొన్నారు. నియమ నిబంధనలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  హెల్మె ట్లు ధరించి, తమ పిల్లలకు హెల్మెట్లు పెట్టని రైడర్లను ఆపి, వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. రోడ్డు భద్రత గురించి,  పిల్లలు కూడా హెల్మెట్లు ధరించేలా చూడ టం యొక్క ప్రాముఖ్యత గురించి వారికి అవగాహన కల్పించారు. ఈ అవగాహన కార్యక్ర మంలో భాగంగా వాహన రైడర్ల పిల్లలకు హెల్మెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్త్స్రలు యాదగిరి,  లక్ష్మయ్య,  జిహెచ్‌ఎంసి డిఈ గీత, ఈఈ, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.