calender_icon.png 3 November, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడిమ్యాలలో రోడ్డు పనులు ప్రారంభం

03-11-2025 02:52:20 AM

చేవెళ్ల, నవంబర్ 2: చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామంలో సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్ల కోసం ఎమ్మెల్యే యాదయ్య హె ఎండిఏ నిధుల నుంచి రూ. 45 లక్షలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం పీఏసీఎస్ చైర్మన్ గోనె ప్రతాప్ రెడ్డి, మండల సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు పడాల ప్రభాకర్, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పడాల రాములు 7వ, 8వ వార్డులో పాత ట్రాన్స్ఫర్ నుండి బాంగ్లాకడి మలమ్మ ఇంటి వరకు సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సహకారంతో సీసీ రోడ్ల తో పాటు బీజాపూర్ హైవే నుంచి హిమాయత్- వికారాబాద్ రోడ్డు వరకు బీటీ రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభించామని చెప్పారు. అలాగే ధర్మాసాగర్ వరకు రీ బీటీ శాంక్షన్ అయ్యిందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హరి కిషన్ రెడ్డి ,మైనార్టీ సెల్ అధ్యక్షులు వాజిత్ , మాజీ వార్డు సభ్యులు, శంకరయ్య, గుండాల నరసింహులు, నేతలు జంగారెడ్డి, మోహన్ రెడ్డి, దర్శన్ రెడ్డి పడాల జనార్ధన్, పడాల మహేందర్, మల్గని రవి, మహేందర్, చాకలి గోపి, చాకలి శ్రీనివాస్, బీరప్ప, హర్షవర్ధన్,బుర్ల మాణిక్యం,కమ్మరి బలరాం, గౌడ్చర్ల శ్రీను, సాయిలు, సుధాకర్, సునీల్, దర్శన్, హైమద్, రాజుసంజీవ, లక్ష్మయ్య, యాదయ్య పాల్గొన్నారు.