calender_icon.png 3 November, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుక్కల స్వురై విహారం..పట్టించుకోని అధికారులు

03-11-2025 02:51:07 AM

ఘట్ కేసర్, నవంబర్ 2 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ మున్సిపల్ ప్రాంతంలో ఎక్కడ చూసినా శునకాలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ కనిపిస్తున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా దొరికిన వారిపై దాడి చేస్తున్నాయి. ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో శునకాలు వీధులల్లో తిరుగు తుండడంతో వృద్ధులు, చిన్నారులు, సామాన్య జనం రోడ్లపైకి రావాలంటేనే జంకుకు న్నారు. నిత్యం కుక్కకాటుకు గురై బాధితులు ఆస్పత్రుల పాలవుతున్న పరిస్థితి ఏర్పడింది.

గత కొన్ని రోజులుగా కుక్కల స్వురై విహారంపై అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.  రాత్రి అయితే రహదారులపై కుక్కలు గుంపులుగా చేరి ద్విచక్రవాహన దారుల వెంటబడటంతో వాటి బారి నుంచి తప్పించుకోబోయి ప్ర మాదాల బారిన పడిన సంఘటనలు అనేకం. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి కుక్కల ఏరివేతకు చర్యలు తీసుకోవాలని కోరారు.