29-07-2025 01:31:09 AM
విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నది
విద్యార్థుల గోసపెట్టుకుంటుంది
బిఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు
చర్ల, జూలై 28 (విజయక్రాంతి): మాటలు చెప్తూ కాలం వెళ్లిపోవచ్చుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమని, అధికారంలోకి వచ్చి నా తర్వాత చేసిన అభివృద్ధి ఏమీ లేదని, విద్యావ్యవస్థలో బ్ర ష్టు పట్టించిందని జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు , పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు. సోమవారం చర్ల బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో విలే కరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ పార్టీ హయంలో అన్ని రంగాలలో అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ పార్టీ ఉట్టి మాటల కోరు ప్రభుత్వం అని రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని , కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతో పోరాటాలతో స్వరాష్ట్రం తెచ్చుకున్నదని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేశామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం వారి కార్యకర్తలకు మాత్రమే ఇల్లు కట్టబెడుతున్నట్లు ప్రతి చోట వినిపిస్తుందన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని మరో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తున్నట్లు ఆరోపించారు.రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పేద ప్రజల జీవితా లతో ఆడుకుంటుందని అంతా ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడిస్తారని వచ్చేది బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం బి ఆర్ ఎస్ పార్టీ కుటుంబాలను పరామర్శించారు.
ఈ కార్యక్రమం డివిజన్ నాయకులు మానే రామకృష్ణ చర్ల మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు ప వన్ కుమార్ మాజీ మండల అధ్యక్షులు సోయం రాజారావు సీనియర్ నాయకులు పోలిన రాముడు సయ్యద్ అజీజ్ తోటపల్లి మాధవరావు పెన్మత్స సీతాపతి రాజు గొర్ల రాజబాబు ఎస్ సి సెల్ అధ్యక్ష కార్యదర్శులు తుర్రం రవి కారం కన్నరావు బి సి సెల్ అధ్యక్ష కార్యదర్శులు
గోరంట్ల వెంకటేశ్వరరావు కేప గణేష్ ఎస్ సి సెల్ అధ్యక్ష కార్యదర్శులు కొంబత్తిని రాము బ ట్ట విజయ్ మరియు కట్టం కాన్నారావు గొర్స పవన్ దినసర పు భాస్కరరెడ్డి రాటనల శ్రీరామ్మూర్తి ఎడ్ల రామదాసు సంతపురి సతీష్ సిద్ది సంతోష్ ఎన్నమూరి సృజన్ గదంసెట్టి కిషోర్ కుక్కడపు సాయి అలం బ్రమ్మ నాయుడు పాగా రాంప్రసాద్ తెగడ రాజు మెంతుల నాగరాజు బంటు వెంకటేశ్వర్లు నవీన్ యాదవ్ శ్రీను మెడబత్తిని గోవర్ధన్ మురళీ తడికల చందు మెయిపా వెంకటేశ్వర్లు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.